టీటీవీ దినకరన్ కు షాక్: ఓటర్లకు డబ్బు, రెడ్ హ్యాండెడ్ గా చిక్కిపోయాడు
అన్నాడీఎంకే పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి, ఆర్ కే నగర నియోజక వర్గంలో ఏఐఏడీఎంకే అమ్మ పార్టీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న టీటీవీ. దినకరన్ అనుచరుడు కరుణమూర్తి స్థానిక ఓటర్లకు డబ్బు పంపిణి చేస్తూ రెడ్ హ్యాండెడ
చెన్నై: అన్నాడీఎంకే పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి, ఆర్ కే నగర నియోజక వర్గంలో ఏఐఏడీఎంకే అమ్మ పార్టీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న టీటీవీ. దినకరన్ అనుచరుడు అడ్డంగా బుక్కయ్యాడు. స్థానిక ఓటర్లకు డబ్బు పంపిణి చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా చిక్కిపోయాడు.
కరుణమూర్తి అనే వ్యక్తి శుక్రవారం ఆర్ కే నగర్ నియోజక వర్గంలో గుట్టుచప్పుడు కాకుండా ఓటర్లకు డబ్బు పంపిణి చెయ్యడానికి ప్రయత్నించారు. పన్నీర్ సెల్వం వర్గంలోని నాయకులు, డీఎంకే పార్టీ కార్యకర్తలకు అనుమానం వచ్చి ఎన్నికల కమిషన్, పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఎన్నికల కమిషన్ అధికారులు ఆర్ కే నగర్ నియోజక వర్గంలోకి వెళ్లి పరిశీలించి కరుణమూర్తిని పట్టుకున్నారు. అతని దగ్గర భారీ మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నారు. ఆర్ కే నగర్ నియోజక వర్గంలో అన్నాడీఎంకే పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న టీటీవీ దినకరన్ అనుచరుడు కరుణమూర్తి అని అధికారులు గుర్తించారు.
కరుణమూర్తిని స్థానిక పోలీసులు అరెస్టు చేసి న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. నిందితుడిని ఏప్రిల్ 13వ తేదీ వరకు రిమాండ్ కు తరించాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. కరుణమూర్తి అరెస్టు కావడంతో టీటీవీ దినకరన్ అనుచరులు షాక్ కు గురైనారు.












Click it and Unblock the Notifications