బాంబు బెదిరింపు: ఢిల్లీలో దిగిన టర్కీష్ విమానం

న్యూఢిల్లీ: టర్కీ వెళ్తున్న విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో ఆ విమానాన్ని ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మంగళవారం మధ్యాహ్నం అత్యవసరంగా దించి వేశారు. ఈ విమానంలో 150 మంది ప్రయాణీకులు ఉన్నారు.

టర్కీష్ ఎయిర్‌లైన్స్ విమానం టికె65 బ్యాంకాక్ నుంచి ఇస్తాంబుల్ వెళుతుండగా.. పైలట్‌కు బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో ఢిల్లీ మీదుగా విమానం వెళుతున్న ఆ విమానం అత్యవసరంగా ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దించేశారు.

Turkish Airlines plane makes emergency landing at IGI Delhi following bomb threat

ఢిల్లీ విమానాశ్రయ అధికారులకు సమాచారం ఇచ్చి.. ఆ విమానాన్ని లాండ్ చేశారు. విమానాశ్రయంలో దూరంగా దిగిన ఆ విమానంలో తనిఖీలు జరుగుతున్నాయి. భారత భద్రతా దళాలు సిఐఎస్ఎఫ్, ఎన్ఎస్‌జి భారీగా చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నాయి.

కాగా, తనిఖీల అనంతరం బాంబు లేదని భద్రతా దళాలు నిర్ధారించాయి. అయితే విమానం బాత్‌రూమ్‌లో ఉన్న అద్దంపై విమానంలో బాంబు పెట్టినట్లు లిప్‌స్టిక్‌తో రాసి ఉందని పైలట్ ఏయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్‌కు సమాచారం అందించారు. బాంబు లేదని తేలడంతో విమానాశ్రయ అధికారులు, పైలట్లు, ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+