"విజయ్ ను రాహులే ప్రధాని చేస్తారు?"- కనిమొళి బిగ్ ట్విస్ట్..!

కాక్రోచ్ ఉద్యమం తర్వాత దేశంలో మారిన పరిస్దితుల్లో ఇప్పటికిప్పుడు దేశంలో ఎన్నికలు జరిగితే ప్రధాని అభ్యర్ధిగా ఎవరికి మద్దతిస్తారంటూ ఇండియా టుడే-సీ ఓటర్ మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వేలో అడిగిన ప్రశ్నకు జనం మోడీ, రాహుల్ తర్వాత విజయ్ (Vijay) కు ఓటేశారు. దీంతో తమిళనాడు రాజకీయాల్లో ఇదో చర్చనీయాంశంగా మారింది. ఓవైపు తమిళనాడు ప్రభుత్వంలో భాగస్వాములుగా కొనసాగుతున్న కాంగ్రెస్-టీవీకే (Congress-TVK) మధ్య ఇది చిచ్చు రేపుతోంది. దీనిపై ఇరు పార్టీల నేతలు రోజుకో ప్రకటన చేస్తున్నారు. దీంతో గందరగోళం మరింత పెరుగుతోంది. అదే సమయంలో విజయ్, రాహుల్ మాత్రం దీనిపై మౌనం వహిస్తున్నారు.

సీఎం విజయ్ తో వైఎస్సార్సీపీ ఎంపీ భేటీ..! తొలిసారి ఇలా..!
సీఎం విజయ్ తో వైఎస్సార్సీపీ ఎంపీ భేటీ..! తొలిసారి ఇలా..!

ఈ నేపథ్యంలో తమిళనాడు సీఎల్పీ నేత తారాహై కత్ బెర్ట్ .. రాహుల్ ప్రధాని అభ్యర్దిత్వానికి విజయ్ మద్దతిస్తానని చెప్పినట్లు బాంబు పేల్చారు. దీంతో ప్రధాని అభ్యర్థిత్వంపై టీవీకే-కాంగ్రెస్ మధ్య క్లారిటీ వచ్చినట్లు అంతా భావించారు. కానీ అంతలోనే టీవీకే ట్విస్ట్ ఇచ్చింది. టీవీకే ఎమ్మెల్యే కనిమొళి సంతోష్ విజయ్ ప్రధాని అవుతారని, ఏదో మ్యాజిక్ జరుగుతుందని తాజాగా వ్యాఖ్యానించారు. దీంతో విజయ్.. రాహుల్ ప్రధాని అభ్యర్దిత్వానికి మద్దతివ్వడం లేదని తేలిపోయింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు కూడా స్పందించడం ప్రారంభించారు.

TVK Projects Vijay as 2029 PM Candidate Rebuts Congress Claim on Rahul Gandhi Support
ప్రధాని అభ్యర్ధి ఎవరో తేల్చేసిన విజయ్..! కాంగ్రెస్ క్లారిటీ..!
ప్రధాని అభ్యర్ధి ఎవరో తేల్చేసిన విజయ్..! కాంగ్రెస్ క్లారిటీ..!

విజయ్ ప్రధాన మంత్రి పదవి కోసం రాహుల్ గాంధీకి మద్దతు ఇస్తారన్న కాంగ్రెస్ వాదనను టీవీకే తిప్పికొట్టింది. ప్రధాన మంత్రి పదవిని ఎవరు చేపట్టాలనే నిర్ణయం ఢిల్లీలో కాకుండా తమిళనాడులోనే జరుగుతుందని, ఆ పదవికి విజయ్ తమ పార్టీ అభ్యర్థి అని టీవీకే ఎమ్మెల్యే కనిమొళి సంతోష్ ( kanimozhi santosh) మరోసారి తేల్చిచెప్పారు. 2029లో విజయ్ ప్రధానమంత్రి అభ్యర్థి అవుతారని,, ఎవరు ప్రధాని కావాలనేది ఢిల్లీ నిర్ణయించదని, తమిళనాడు నిర్ణయిస్తుందని కనిమొళి స్పష్టం చేశారు. 2029లో ఒక అద్భుతం జరగబోతోందని, స్వయంగా రాహుల్ గాంధీయే విజయ్‌ను ప్రధానమంత్రిని చేస్తారని తేల్చిచెప్పేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+