తమిళనాట విజిల్ మోత- మూడో స్థానంలో డీఎంకే, ఎన్డీఏ పై విజయ్ రివేంజ్..!!
తమిళనాడులో అనూహ్య ఫలితాలు వస్తున్నాయి. తొలుత డీఎంకే అధిక్యత కొనసాగినా.. టీవీకే అనూహ్యంగా పుంజుకుంది. డీఎంకే మూడో స్థానం కు పడిపోయింది. అన్నా డీఎంకే కూటమి రెండో స్థానంలో కొనసాగుతోంది. అందరి అంచనాలు తల కిందులు చేస్తూ.. విజయ్ పార్టీ విజిల్ తో మోత పుట్టిస్తోంది. దీంతో.. తుది ఫలితాల తరువాత ఆట మరింత ఆసక్తి కరంగా మారే అవకాశం కనిపిస్తోంది. ఎవరికీ మేజిక్ రాకపోతే... విజయ్ అన్నా డీఎంకే మద్దతుతో కింగ్ కావటం ఖాయమనే విశ్లేషణలు వస్తున్నాయి.
తమిళనాడు ఎన్నికల్లో కౌంటింగ్ కొనసాగేకొద్దీ ఆసక్తి కర ఫలితాలు వస్తున్నాయి. అధికార డీఎంకే ఆధిక్యత ఇప్పటి వరకు స్పష్టంగా కనిపించినా ఒక్క సారిగా ట్రెండ్స్ మారుతున్నాయి. ఎన్డీఏ పై విజయ్ రివేంజ్ తీసుకుంటున్నారు. తాజాగా అందుతున్న ట్రెండ్స్ లో విజయ్ ఒక్క సారిగా దూసుకొచ్చారు. దీంతో.. మిగిలిన రౌండ్ల పోటీ ఆసక్తి కరంగా మారుతోంది. విజయ్ పార్టీ 90 స్థానాల్లో ఆధిక్యతలో ఉండగా.. డీఎంకే 53, అన్నా డీఎంకే కూటమి 68 స్థానాల్లో లీడ్ లో ఉన్నారు. పోస్టల్ బ్యాలెట్ లో డీఎంకే, ఎన్డీఏ ను దాటి విజయ్ ఓట్లు సొంతం చేసుకున్నారు. దీంతో.. తమిళనాట కొత్త చరిత్ర నమోదు కానుందా అనే ఉత్కంఠ కొనసాగుతోంది. సీఎం స్టాలిన్.. డీప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ రెండు నియోజకవర్గాల్లో వెనుకజంలో ఉన్నారు. దీంతో.. రానున్న రౌండ్ల ఓట్ల లెక్కింపు పైన మరింత ఉత్కంఠ కొనసాగుతోంది.

తమిళనాట హంగ్ తప్పదనే సంకేతాలు
ఎప్పుడూ ద్విముఖ పోరు జరిగే తమిళనాడులో ఈసారి త్రిముఖ పోరు సాగింది. దశాబ్దాలుగా రాష్ట్ర రాజకీయాలను డీఎంకే లేదా అన్నాడీఎంకే పార్టీలే శాసిస్తుండగా.. వీటి మధ్యలోకి ఈసారి'తమిళ వెట్రి కళగం' (టీవీకే) పార్టీతో సినీనటుడు విజయ్ ప్రవేశించారు. రాష్ట్రంలో 234 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 23న ఒకే విడతలో పోలింగ్ నిర్వహించగా.. 85.10శాతం పోలింగ్ నమొదైంది.
సీఎం స్టాలిన్ నేతృత్వంలోని అధికార డీఎంకేదే ఈసారి కూడా అధికారమని మె జారిటీ ఎగ్జిట్‌పోల్ సర్వేలు ప్రకటించాయి. 'యాక్సిస్ మై ఇండియా' మాత్రం విజయ్ పార్టీ ఏకంగా 120 వరకు సీట్లు గెలుస్తుందని అంచనా వేసింది. దీంతో ఫలితాలపై ఉత్కంఠ ఏర్పడింది. కాగా, రాష్ట్రంలో హంగ్ ఏర్పడే అవకాశముందన్న అంచనాలతో దళపతి విజయ్ తన పార్టీ అభ్యర్థులను అప్రమత్తం చేశారు. గెలిచేవారంతా వెంటనే పార్టీ ప్రధాన కార్యాలయంలో రిపో ర్టు చేయాలని ఆదేశించారు. వారిని ఓ రిసార్టుకు తరలించే ఆలోచనలో ఆయన ఉన్నట్లు సమాచారం. అయితే, వస్తున్న ట్రెండ్స్ ఎగ్జిట్ పోల్స్ కు అనుగుణంగా కనిపిస్తున్నాయి. మరి కాసేపట్లో స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.













Click it and Unblock the Notifications