మోడల్ ప్రియాంక ఆత్మహత్యకు కారణాలివే
న్యూఢిల్లీ: వివాహమై నెల రోజులు కూడా గడవకముందే మోడల్ ప్రియాంక కపూర్(26) ఆత్మహత్య చేసుకున్న ఘటన ఢిల్లీలో సంచలనంగా మారింది. తన భర్త పెట్టే వేధింపులు తట్టుకోలేక తాను ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రియాంక తన సూసైడ్ నోట్‌లో పేర్కొనడం గమనార్హం.
తన జీవన శైలిని ఇష్టపడని భర్త తరచూ చిత్రహింసలకు గురిచేస్తుండేవాడని ప్రియాంక తన ఆత్మహత్య లేఖలో వెల్లడించింది. ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థను నడుపుతున్న ప్రియాంక.. తాను నివాసం ఉంటున్న డిఫెన్స్ కాలనీలోని తన గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని శనివారం ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే.
ప్రియాంక ఆత్మహత్యకు కారణమైన ఆమె భర్త, ప్రముఖ వ్యాపారవేత్త నితిన్ చావ్లాను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రియాంక కుటుంబసభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గత కొన్ని రోజులుగా కట్నం కోసం నితిన్.. ప్రియాంకపై వేధింపులకు పాల్పడుతున్నాడు. ఆత్మహత్య చేసుకునే ముందు నితిన్.. ప్రియాంకను ఇంట్లో నుంచి వెళ్లిపోమ్మన్నాడని పోలీసులు తెలిపారు.

ప్రియాంక సూసైడ్ నోడ్ ఇలావుంది..' నితిన్ నన్ను ఇల్లు వదిలి వెళ్లిపొమ్మాన్నాడు. అందుకే నేను ఈ ప్రపంచాన్ని వదిలివెళుతున్నా. చిన్న చిన్న కారణాలతో నితిన్ నన్ను తీవ్రంగా కొట్టేవాడు. పబ్స్, బార్లకు వెళ్లకుండా చాలాసార్లు నన్ను అడ్డుకున్నాడు' అని ప్రియాంక తెలిపింది.
మొదటి భార్య సంతానమైన నితిన్ పదేళ్ల కొడుకు ముందే నితిన్.. ప్రియాంకతో ఘర్షణకు దిగాడు. ఆ తర్వాత ఆమెను ఇంట్లో నుంచి వెళ్లిపోవాలన్నాడని పోలీసులు తెలిపారు. ప్రియాంక సూసైడ్ నోట్‌కు సంబంధించి రెండు కాపీలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నితిన్‌తో వివాహమయ్యాక తాను నిరాశ నిస్పృహలకు లోనైనట్లు ప్రింయాక తన సూసైడ్ నోట్‌లో పేర్కొంది.
ప్రియాంక సోదరి డింపి కపూర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామని, నితిన్‌ను అరెస్ట్ చేసి విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు. భర్త పెట్టే కట్నం వేధింపులు తాళలేకే తన సోదరి ప్రియాంక ఆత్మహత్య చేసుకుందని డింపి కపూర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
కాగా, గత డిసెంబర్‌లో నితిన్ తన మొదటి భార్యకు విడాకులిచ్చాడు. వీరిద్దరికి పదేళ్ల కుమారుడు, 8ఏళ్ల కూతురు ఉంది. విడాకులు తీసుకున్న తర్వాత మొదటి భార్యతో కలిగిన కొడుకును నితిన్ తన వద్దే ఉంచుకున్నాడు. ఇతను కూడా ప్రియాంక-నితిన్‌ల మధ్య గొడవలకు కారణం కావొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.












Click it and Unblock the Notifications