ట్విస్ట్: ప్రియుడితో కలిసి ఇంటికి వెళ్లిన యువతి, అభ్యంతరం చెప్పిన తల్లి, లవర్ తో కలిసి !

ప్రియుడిని నేరుగా ఇంటికి తీసుకెళ్లిన యువతిఅభ్యంతరం చెప్పిన తల్లి, ఇద్దరి మధ్య మాటామాటా పెరిగిందిప్రియుడితో కలిసి అన్నంత పని చేసింది, మాయం అయితే వదిలేస్తారా ?

బెంగళూరు: ప్రియుడిని ఇంటికి తీసుకెళ్లిన సమయంలో అభ్యంతరం వ్యక్తం చేసిన తల్లిని ఆమె కుమార్తె హత్య చేసింది. తరువాత ప్రియుడితో కలిసి పరారైన యువతిని పోలీసులు అరెస్టు చేశారు. కర్ణాటకలోని బాగల్ కోటే జిల్లాలో జరిగిన ఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. బాగల్ కోటే జిల్లా బాదామి తాలుకా కెరూరు పట్టణంలో సంగవ్వ (50) అనే మహిళ కుమార్తె హర్షాతో కలిసి నివాసం ఉంటున్నది.

అక్టోబర్ 31వ తేదీన సంగవ్వ ఇంటిలో అనుమానాస్పద స్థితిలో మరణించింది. సంగవ్వను హత్య చేసి ఉంటారని ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంగవ్వ కుమార్తె హర్షా కూడా కనిపించడం లేదని పోలీసులు గుర్తించారు.

Twist to woman murder case daughter killed her mother near bagalkot in Karnataka.

అప్పటి నుంచి సంగవ్వ కుమార్తె హర్షా కోసం పోలీసులు గాలించారు. చివరికి శుక్రవారం హర్షా, ఆమె ప్రియుడు శ్రీకాంత్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. అక్టోబర్ 31వ తేదీన హర్షా తన ప్రియుడు శ్రీకాంత్ ను పిలుచుకుని ఇంటికి వెళ్లింది.

ఆ సందర్బంలో శ్రీకాంత్ ను ఎందుకు ఇంటికి తీసుకు వచ్చావు అంటూ సంగవ్వ కుమార్తెతో గొడవ పెట్టుకునింది. ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. ఆ సందర్బంలో సహనం కొల్పోయిన హర్షా ప్రియుడు శ్రీకాంత్ తో కలిసి సంగవ్వ గొంతు నులిమి హత్య చేసి పరరైయ్యారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+