బీజేపీ గూటికి సింగ్వీ..? కోడై కూస్తున్న ట్వీట్టర్, సింధియా బాటలోనేనని.. గాసిప్స్‌పై రియాక్షన్...
కాంగ్రెస్ సీనియర్ నేత, ప్రముఖ న్యాయవాది అభిషేక్ మను సింగ్వీ పార్టీ మారతారనే ప్రచారం జరుగుతోంది. ఆయన కాంగ్రెస్ నుంచి బీజేపలో చేరతారని సోషల్ మీడియా ట్వీట్టర్ కోడై కూస్తోంది. దీనిపై సింగ్వీ స్పందించారు. తనపై గాసిప్ ప్రచారం చేసినవారికి ధన్యవాదాలు తెలిపారు. మీ కేంద్రంగా తనను ఎంచుకోవడంపై సెటైరిక్‌గా సింగ్వీ రియాక్టయ్యారు. ఊహాగానాలు డేవిల్ రేడియో వంటివదని సింగ్వీ కోట్ చేశారు.

ఫేమస్ లాయర్..
అభిషేక్ మను సింగ్వీ సీనియర్ కాంగ్రెస్ నేత. పశ్చిమ బెంగాల్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా.. అధికార బీజేపీ విధానాలను ఎండగడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లలో సింగ్వీ వాదనలు వినిపించారు.

బీజేపీ గూటికి..
సీనియర్ కాంగ్రెస్ నేత బీజేపీలో చేరతారని ట్వీట్టర్‌లో పోస్టులు వైరలయ్యాయి. దీంతో సింగ్వీ స్పందించారు. కాంగ్రెస్ పార్టీ పలుకుబడిని దెబ్బతీసేందుకు ఊహాగానాలు వినిపించాయని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా ఆరోపించారు. అయితే సుర్జేవాలా హోంమంత్రి అమిత్ షాతో టచ్‌లో ఉన్నారని ఊహాగానాలు వినిపించాయి. బీజేపీ పార్టీ చీఫ్ జేపీ నడ్డా ఉన్నప్పటికీ చేరికలపై అమిత్ షా సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది.
Recommended Video

సింధియా మాదిరిగా..
ఇటీవల మధ్యప్రదేశ్ కీలక నేత జ్యోతిరాదిత్య సింధియా బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. దీంతో ఆ రాష్ట్రంలో ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలోకి మారింది. శివరాజ్ సింగ్ చౌహాన్ సీఎం బాధ్యతలు చేపట్టారు. మధ్యప్రదేశ్ సంక్షోభ సమయంలో ఎమ్మెల్యేలకు రక్షణ కల్పించింది సింగ్వీ అనే ఆరోపణలు కూడా వినిపించాయి. కానీ దీనిని సింగ్వీ కొట్టిపారేశారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications