పక్క పక్కనే..120 అడుగుల భవనాలు.. మధ్యలో విగతజీవిగా ఆమె...!!!
న్యూఢిల్లీ : దేశ రాజధాని శివారు నోయిడాలో ఓ యువతి మృతదేహం కలకలం రేపింది. అయితే ఆమె మృతదేహం రెండు భవనాల మధ్య ఇరుక్కొవడంతో ఏం జరిగి ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకీ యువతి ఆత్మహత్య చేసుకుందా ? లేదంటే హత్యకు గురైందా అనే కోణంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది.
భవనాల మధ్యలో ..
నోయిడాలోని అమ్రపాలి సిలికాన్ సొసైటీలో 120 అడుగుల ఎత్తున్న రెండు భవనాలు ఉన్నాయి. పక్క పక్కనే ఆ భవనాలను నిర్మించారు. ఇంతవరకు ఓకే .. కానీ ఆ భవనం మధ్యలో ఓ యువతి నిర్జీవంగా పడి ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఆ యువతి సొసైటీలోని ఓ దంపతుల ఇంట్లో పనిచేస్తుందని పోలీసులు తెలిపారు. అయితే ఆమె విగతజీవిగా మారడానికి కారణాలు ఇంకా తెలియరాలేదని .. విచారణ జరుపుతున్నామని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు.

ఉపాధి కోసం వచ్చి ...
బీహర్‌లోని కత్తీహర్ జిల్లాకు చెందిన యువతి .. పొట్టకూటి కోసం నోయిడా వచ్చింది. అక్కడే ఓ ఇంట్లో పనిచేస్తూ .. నివసిస్తోంది. అయితే జూన్ 28న యువతి కనిపించకుండా పోయింది. దీంతో మిన్సింగ్ కేసు కూడా నమోదుచేసినట్టు పోలీసులు తెలిపారు. అయితే ఇంతలో ఆ రెండు భవనాల మధ్య నిర్జీవంగా కనిపించింది. దీంతో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహకారం తీసుకున్నారు. దాదాపు రెండుగంటలపాటు కష్టపడి మృతదేహన్ని బయటకు తీశారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలు తెలియరాలేదని పోలీసులు తెలిపారు. మృతదేహన్ని పోస్టుమార్టం కోసం తరలించినట్టు పేర్కొన్నారు. నివేదిక ఆధారంగా మృతికి గల కారణాలు తెలియవచ్చని పోలీసులు భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications