Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వెలుగుచూసిన మరో ఘోరం: ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి, లైంగిక దాడి

ఇంఫాల్: మణిపూర్ రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు కొనసాగుతున్నాయి. అయితే, తాజాగా, ఆ రాష్ట్రంలో జరిగిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ గ్రామంలో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించారు. అనంతరం వారిపై సామూహిక లైంగిక దాడికి పాల్పడినట్లు గిరిజన సంఘం ఆరోపించింది.

మణిపూర్ రాజధాని ఇంఫాల్‌కు 35 కిలోమీటర్ల దూరంలోని కాంగ్‌పోక్పి జిల్లాలో ఈ ఘటన జరిగింది. మే 4న ఈ హేయమైన సంఘటన జరిగినట్లు ఆదివాసీ గిరిజన నాయకుల ఫోరమ్ (ఐటీఎల్‌ఎఫ్‌) పేర్కొంది. ఈ సంఘటనకు ముందు లోయ ప్రాంతంలోని మెజార్టీ వర్గమైన మైతీ, కొండ ప్రాంతాల్లో నివసించే కుకీ వర్గం మధ్య ఘర్షణలు చెలరేగాయి.

two Women Paraded Naked, Gangraped Amid Manipur Violence; Video surfaced

అయితే, మే 4న జరిగిన ఈ దారుణ ఘటనకు సంబంధించిన వీడియో క్లిప్స్‌ సోషల్‌ మీడియాలో తాజాగా, వైరల్‌ అవుతున్నాయి. మహిళలు ఎంత వేడుకున్నా నిందితులు కనికరించకుండా వారిని హింసించారు. అంతేగాక, వీడియోలు తీసి వైరల్ చేయడం మరింత పైశాచికాన్ని చాటుకున్నారు. ఈ నేపథ్యంలో దారుణ ఘటనపై రాజకీయ పార్టీలు, మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాయి.

ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. కాగా, మణిపూర్‌లోని బీజేపీ ప్రభుత్వం రెండు నెలల కిందట ఎస్టీ స్టేటస్‌ కోసం డిమాండ్‌ చేస్తున్న మైతీ వర్గానికి అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. కుకీ వర్గం దీనిని వ్యతిరేకించడంతో నాటి నుంచి ఈ రెండు వర్గాల మధ్య ఘర్షణలు చెలరేగుతున్నాయి.

ఈ హింసలో వందలాది మంది మరణించగా వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే మణిపూర్‌‌లో రాష్ట్ర పోలీసులతోపాటు కేంద్ర బలగాలు మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చాయి. అయినప్పటికీ కొన్ని చోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటుండటం గమనార్హం. గురువారం నుంచి పార్లమెంటు సమావేశాలు జరగనున్న క్రమంలో ఈ దారుణ వీడియో వైరల్ కావడం చర్చనీయాంశంగా మారింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+