UB City: సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ రోల్స్ రాయిస్ కారు సీజ్, రాత్రి కారులో సల్మాన్ ఖాన్, ఆ టైమ్ లో !
బెంగళూరు/ ముంబాయి/ న్యూఢిల్లీ: కరోనా వైరస్, నైట్ కర్ఫ్యూ నియమాలు ఉల్లంఘించి వాహనాలు నడుపుతున్న వారికి సిటీ ట్రాఫిక్ విభాగం పోలీసులు, ఆర్ టీఓ అధికారులు చుక్కలు చూపించారు. కోట్ల రూపాయల విలువైన లగ్జరీ కార్లలో రోడ్ల మీదకు వచ్చి రయ్ రయ్ అంటూ దూసుకుపోతున్న వారి ఆగడాలకు ట్రాఫిక్ పోలీసులు, ఆర్ టీఓ అధికారులు కళ్లెం వేశారు. కరోనా వైరస్ మహమ్మారిని అరికట్టడానికి నైట్ కర్ఫ్యూ జారీ చేసినా కోవిడ్ నియమాలు ఉల్లంఘించి యూబీ సిటీలోని ఫేమస్ పబ్ లో మద్యం సేవిస్తూ జల్సా చేస్తున్న వారి వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బాలీవుడ్ సూపర్ స్టార్, బిగ్ బి అమితాబ్ బచ్చన్ కు చెందిన కోట్ల రూపాయల విలువైన కారును సల్మాన్ ఖాన్ నడుపుతున్న సమయంలో ఆ కారును ఆర్ టీఓ అధికారులు, సిటీ ట్రాఫిక్ పోలీసులు సీజ్ చేశారు. ముంబాయిలో ఉన్న అమితాబ్ బచ్చన్ పేరుతో ఉన్న కారును బెంగళూరులో ఎందుకు నడుపుతున్నారు ? అంటూ అధికారులు ఆరా తీశారు. ముంబాయిలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కు నోటీసులు జారీ చేసిన అధికారులు ఆయన ఏం సమాధానం ఇస్తారో ? అని వేచి చూస్తున్నారు. మొత్తం మీద అమితాబ్ బచ్చన్ పేరుతో రిజిస్టర్ అయిన రోల్స్ రాయిస్ కారును సల్మాన్ ఖాన్ ఎందుకు నడుపుతున్నాడు ? అని పోలీసులు ఆరా తీశారు.

యూబీ సిటీలో హంగామా
కరోనా వైరస్ మహమ్మారిని అరికట్టడానికి ఐటీ హబ్ బెంగళూరు సిటీలో నైట్ కర్ఫ్యూ అమలులో ఉంది. కోవిడ్ నియమాలు ఉల్లంఘించి నైట్ కర్ఫ్యూ జారీలో ఉన్నా నియమాలు తుంగలో తొక్కేసి విలాసవంతమైన కార్లలో రయ్ రయ్ అంటూ సంచరిస్తున్న వారి భరతం పట్టాలని ట్రాఫిక్ పోలీసులు, ఆర్ టీఓ అధికారులు డిసైడ అయ్యారు. బెంగళూరులోని యూబీ సిటీలో విలాసవంతమైన కార్లలో తిరుగుతూ చాలా మంది ఎంజాయ్ చేస్తున్నారని పోలీసు అధికారులకు సమాచారం అందింది.

యూబీ సిటీలో చుక్కలు చూపించిన పోలీసులు
కరోనా వైరస్, నైట్ కర్ఫ్యూ నియమాలు ఉల్లంఘించి వాహనాలు నడుపుతున్న వారికి ఆదివారం రాత్రి బెంగళూరు సిటీ ట్రాఫిక్ విభాగం పోలీసులు, ఆర్ టీఓ అధికారులు చుక్కలు చూపించారు. బెంగళూరులోని యూబీ సిటీలో కోట్ల రూపాయల విలువైన లగ్జరీ కార్లలో రోడ్ల మీదకు వచ్చి రయ్ రయ్ అంటూ దూసుకుపోతున్న వారి ఆగడాలకు బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు, ఆర్ టీఓ అధికారులు కళ్లెం వేశారు.

బిగ్ బి అమితాబ్ బచ్చన్ కారు సీజ్
కరోనా వైరస్ మహమ్మారిని అరికట్టడానికి నైట్ కర్ఫ్యూ జారీ చేసినా కోవిడ్ నియమాలు ఉల్లంఘించి యూబీ సిటీలోని ఫేమస్ పబ్ లో మద్యం సేవిస్తూ జల్సా చేస్తున్న వారి వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం రాత్రి బెంగళూరులోని యూబీ సిటీలో బాలీవుడ్ సూపర్ స్టార్, బిగ్ బి అమితాబ్ బచ్చన్ కు చెందిన కోట్ల రూపాయల విలువైన కారును సల్మాన్ ఖాన్ నడుపుతున్న సమయంలో ఆ కారును ఆర్ టీఓ అధికారులు, బెంగళూరు సిటీ ట్రాఫిక్ పోలీసులు సీజ్ చేశారు.

రికార్డులు ఏమాత్రం లేవు
అమితాబ్ బచ్చన్ పేరుతో ఉన్న రూ. కోట్ల రూపాయల విలువైన రోల్స్ రాయిస్ కారును సీజ్ చేసిన అధికారులు ఆ వాహనాన్ని నడుపుతున్న సల్మాన్ ఖాన్ అనే వ్యక్తిని డాక్యూమెంట్లు చూపించాలని ట్రాఫిక్ పోలీసులు, ఆర్ టీఓ అధికారులు సూచించారు. అయితే కారుకు సంబంధించిన కారు పత్రాలు ఒక్కటి కూడా సల్మాన్ ఖాన్ దగ్గర లేదని బెంగళూరు ట్రాఫిక్ విభాగం అడిషనల్ పోలీసు కమీషనర్ ఎన్. శివకుమార్ సోమవారం బెంగళూరులో మీడియాకు చెప్పారు.

రూ. 6 కోట్లకు అమ్మేసిన అమితాబ్ !
2019లో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఢిల్లీకి చెందిన ఓ కారు డీలర్ ద్వారా బెంగళూరుకు చెందిన షరీష్ అలియాస్ బాబుకు రోల్స్ రాయిస్ కారును విక్రయించారని సమాచారం. బెంగళూరుకు చెందిన షరీఫ్ మీడియాతో మాట్లాడుతూ తాను అమితాబ్ బచ్చన్ దగ్గర రూ. 6 కోట్లకు ఆయన కారు కొనుగోలు చేశానని మీడియాకు చెప్పారు. అమితాబ్ బచ్చన్ దగ్గర కారు కొనుగోలు చేసిన షరీఫ్ ఆ కారును అతని పేరుతో ట్రాన్సఫర్ చేయించుకోకుండా అమితాబ్ బచ్చన్ పేరుతోనే పెట్టి ఆ కారును బెంగళూరులో నడుపుతున్నాడని రవాణా శాఖ కమీషనర్ (ఆర్ టీఓ) నరేంద్ర హోళ్లార్ మీడియాకు చెప్పారు.

రూ. కోట్ల విలువైన కార్లు సీజ్
ఆదివారం రాత్రి బెంగళూరులో సీజ్ చేసిన కోట్ల రూపాయల విలువైన లగ్జరీ కార్లకు నకిలీ నెంబర్ ప్లేట్లు ఉన్నాయని, వాటి వివరాలు రవాణా శాఖ వెబ్ సైట్లలో కూడా అందుబాటులో లేవని బెంగళూరు రవాణా శాఖ కమీషనర్ నరేంద్ర అంటున్నారు. ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో సీజ్ చేసిన రూ. కోట్ల విలువైన 7 కార్లను నెలమంగళ ఆర్ టీఓ కార్యాలయం ఆవరణంలో పార్క్ చేశామని అధికారులు అంటున్నారు.
Recommended Video

అమితాబ్ బచ్చన్ కు నోటీసులు జారీ
ముంబాయిలో ఉన్న అమితాబ్ బచ్చన్ పేరుతో ఉన్న కారును బెంగళూరులో ఎందుకు నడుపుతున్నారు ? అని అధికారులు ఆరా తీశారు. ముంబాయిలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కు నోటీసులు జారీ చేసిన బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు, ఆర్ టీఓ అధికారులు ఆయన ఏం సమాధానం ఇస్తారో ? అని వేచి చూస్తున్నారు. అమితాబ్ బచ్చన్ పేరుతో ఉన్న కారు మహారాష్ట్రలో రిజిస్టర్ అయ్యిందని అధికారులు అంటున్నారు.
-
300 లోడింగ్.. చేసేది ఆ జట్లేః టీమిండియా లెజెండర్ -
SRH.. ఏదో తేడాగా ఉందేంటీ -
ఆర్టీవో ఆఫీసులకు తిరిగే పని లేకుండా తెలంగాణా వాహనదారులకు సీఎం రేవంత్ శుభవార్త! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్












Click it and Unblock the Notifications