లేడీ జర్నలిస్ట్తో అసభ్యంగా: ఉబేర్ క్యాబ్ డ్రైవర్ అరెస్టు
కోల్కతా: ఉబేర్ సంస్థ మరో వివాదంలో చిక్కుకుంది. ఓ ఆంగ్ల దినపత్రికలో పనిచేస్తున్న మహిళా జర్నలిస్టు పట్ల అసభ్యంగా ప్రవర్తించాడనే ఆరోపణపై పోలీసులు ఉబేర్ క్యాబ్ డ్రైవర్ను అరెస్టు చేశారు. బుధవారంనాడు అతన్ని కోల్కతా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మంగళవారం రాత్రి సంఘటన జరిగింది. కామాక్ స్ట్రీట్ నుంచి సర్వే నగరంలోని దక్షిణ ప్రాంతంలో గల సర్వే పార్క్లో ఉన్న తన నివాసానికి వెళ్లడానికి మహిళా జర్నలిస్టు క్యాబ్ మాట్లాడుకుంది. ప్రయాణంలో డ్రైవర్ మొహమ్మద్ ఖుర్బాన్ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడనే ఆరోపణలు వచ్చాయి.

ఫిర్యాదు మేరకు అతను మహిళ శరీరాన్ని గానీ భౌతికపరమైన అసభ్యతకు గానీ పాల్పడలేదు. అయితే, ఆమెతో అతను అసభ్యంగా మాట్లాడాడని, దూషించాడని మాత్రం ఆరోపణలు ఉన్నాయి.
మహిళ ఫిర్యాదు మేరకు డ్రైవర్ను పోలీసులు అరెస్టు చేశారు. అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గతంలో కూడా ఉబేర్ క్యాబ్ డ్రైవర్లపై ఆరోపణలు వచ్చాయి.
-
today rashiphalalu: నేడు ముఖ్య గ్రహాల గోచారంతో వీరి పంట పండుతుంది.. మీరున్నారా? -
తమిళనాడు, కేరళ, బెంగాల్, అసోంలో గెలుపెవరిది ? సీఓటర్ తాజా సర్వే..! -
అల్లు అర్జున్.. ఇండియన్ స్క్రీన్ పై ఎప్పుడూ చూడని రోల్: గగుర్పాటు -
చెన్నై సూపర్ కింగ్స్ కు భారీ ఉపశమనం- పులి వచ్చింది -
ఓటీటీలోకి తెలుగు బోల్డ్ మూవీ.. అర్జున్ రెడ్డికి మించి.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్ -
'హ్యాపీ బర్త్ డే బావా'.. ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్.. బన్ని షాకింగ్ రిప్లై.. -
అమరావతికి కేంద్రం మరో భారీ గుడ్ న్యూస్, ఈ సారి ఏకంగా..!! -
74 రూపాయలకే 12 వేల కోట్ల ఆస్తి! అపర కుబేరుడి పతనం -
SPG గురించి ప్రపంచానికి తెలియని రహస్యాలు. -
AP Inter Results 2026: ఇంటర్ ఫలితాలు ఎప్పుడంటే ? బోర్డు క్లారిటీ..! -
కుప్పకూలిన ధరలు: సీజ్ ఫైర్ దెబ్బకు -
పెద్దిని ఎదుర్కొనడం అంటే సాహసమే












Click it and Unblock the Notifications