పేరుకు మాత్రమే ఉడిపి స్వామిజీ హిందుత్వవాది, 14 ఏళ్లుగా ముస్లీం డ్రైవర్లు, రంజాన్ కు ఇఫ్తార్ విందు!
బెంగళూరు: కర్ణాకలోని ఉడిపి శ్రీకృష్ణమఠాధిపతి శ్రీ విశ్వేశతీర్థ స్వామిజీ పక్కా హిందుత్వవాది అని అందరూ అంటుంటారు. అయితే శ్రీ విశ్వేశతీర్థ స్వామిజీ ఆయన కారు డ్రైవర్ గా ముస్లీం యువకుడిని నియమించుకున్నారు. అనేక హిందూ సంఘ, సంస్థలు మీరు ఎలా ముస్లీం యువకుడిని కారు డ్రైవర్ గా నియమించుకుంటారు అంటూ చాల మంది అభ్యంతరం వ్యక్తం చేసినా శ్రీ విశ్వేశతీర్థ స్వామిజీ మాత్రం ఎవ్వరి మాటలు పట్టించుకోలేదు. స్వామిజీ కారు డ్రైవర్ మహమ్మద్ ఆరీఫ్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులు ముగ్గురు మఠంలో గత 14 ఏళ్లుగా కారు డ్రైవర్లుగా పని చేశారు. రంజాన్ పండుగకు స్వామిజీ ఇఫ్తార్ విందు ఇచ్చి చరిత్రలో నిలిచిపోయారు.

శ్రీకృష్ణుడికి పూజ మాత్రం మిస్ కాదు
ఉడిపిలోని అష్టమఠాల పీఠాధిపతి శ్రీ విశ్వేశతీర్థ స్వామిజీ ఎన్ని అండంకులు, అవాంతాలు ఎదురైనా ప్రతిరోజు క్రమం తప్పకుండా శ్రీకృష్ణుడికి ప్రత్యేక పూజలు చేసేవారు. శ్రీకృష్ణుడికి పూజలు చెయ్యకుండా ఆయన దినచర్య ప్రారంభం అయ్యేది కాదనే విషయం స్వామిజీ సన్నిహితులు చాల సందర్భాల్లో చెప్పారు. ఇదే విషయంలో చాల మంది శ్రీవిశ్వేశతీర్థ స్వామిజీని హిందుత్వవాది అని అనేవారు.

పేరుకు మాత్రమే హిందుత్వవాది
ఉడిపి శ్రీకృష్ణమఠాధిపతి శ్రీ విశ్వేశతీర్థ స్వామిజీ పక్కా హిందుత్వవాది అని అందరూ అంటుంటారు. అయితే శ్రీ విశ్వేశతీర్థ స్వామిజీ పేరుకు మాత్రమే హిందుత్వవాది. ఆయన హిందువులతో సమానంగా ముస్లీంలను గౌరవించేవారు. శ్రీ విశ్వేశతీర్థ స్వామిజీ అన్ని విషయాల్లో ఓకే కాని ముస్లీంలను ఎందుకు దగ్గర తీసుకుంటున్నారు అంటూ చాల మంది వ్యతిరేకించినా స్వామిజీ మాత్రం వారి మాటలను లెక్కచెయ్యలేదు.

ముస్లీం కుటుంబ సభ్యులు
శ్రీవిశ్వేశతీర్థ స్వామిజీ కారు డ్రైవర్ పేరు మహమ్మద్ ఆరీఫ్. గత 14 సంవత్సరాల నుంచి మహమ్మద్ ఆరీఫ్ తండ్రి, సోదరుడు స్వామిజీ కారు డ్రైవర్లుగా పని చేస్తున్నారు. మా కుటుంబ సభ్యులను శ్రీవిశ్వేశతీర్థ స్వామిజీ ఏ రోజు కారు డ్రైవర్లుగా చూడలేదని, సొంత మనుషులుగా చూసుకునేవారని స్వామిజీ కారు డ్రైవర్ మహమ్మద్ ఆరీఫ్ బోరున విలపిస్తున్నాడు.

ముస్లీంలకు సహాయం
శ్రీవిశ్వేశతీర్థ స్వామిజీ కారు డ్రైవర్ మహమ్మద్ ఆరీఫ్ మీడియాతో మాట్లాడుతూ స్వామిజీ భగవద్గీతతో పాటు ఖురాన్ కూడా చదవేవారని, అందులోని మంచిమాటలు తనకు చెప్పేవారని గుర్తు చేసుకున్నారు. మాతో పాటు అనేక ముస్లీం కుటుంబాలకు ఎన్నోసార్లు స్వామీజీ సహాయం చేశారని గుర్తు చేసుకున్నారు. ముస్లీం పండుగలకు మాకు ఎంతో మందికి స్వామిజీ సహాయం చేశారని, ఇంకా ఏమైనా సహాయం కావాలా అని మరీ అడిగేవారని కారు డ్రైవర్ మహమ్మద్ ఆరీఫ్ గుర్తు చేశారు.

రంజాన్ కు ఇఫ్తార్ విందు
రంజాన్ పండుగ సందర్బంగా శ్రీవిశ్వేశతీర్థ స్వామిజీ ఉడిపిలో ఇఫ్తార్ విందు ఇచ్చి చరిత్రలో నిలిచిపోయారని మహమ్మద్ ఆరీఫ్ అన్నారు. మొత్తం మీద 14 ఏళ్ల పాటు తన కారు డ్రైవర్లుగా ముస్లీం కుటుంబానికి చెందిన వారిని స్వామిజీ నియమించుకుని అందరికీ ఆదర్శంగా నిలిచారు. ముస్లీం పండుగలు వస్తే తనను దగ్గరకు పిలిచి నీకు ఏమైనా సహాయం కావాలంటే చెప్పాలని తనను పదేపదే అడిగేవారని, ఉడిపి మఠంలో తాను తిరగడానికి ఎలాంటి ఆంక్షలు పెట్టలేదని, స్వామిజీ నిజంగా మాకు దేవుడితో సమానం అని కారు డ్రైవర్ మహమ్మద్ ఆరీఫ్ విలపిస్తున్నాడు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications