కడుపులో కొకైన్.. విలువ రూ. 845 కోట్లు.. న్యూ ఇయర్ వేడుకల డగ్స్ కలకలం
ఢిల్లీ విమానాశ్రయంలో డ్రగ్స్ కలకలం రేపింది. ఉగాండా నుంచి వచ్చిన మహిళ నుంచి భారీగా కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన కొకైన్ విలువ సుమారు రూ. 845 కోట్లు ఉంటుందని కస్టమ్స్ అధికారులు తెలిపారు. ఆమెను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.

కడుపులో 91 క్యాప్యుల్స్.
న్యూఇయర్ వేడుకల వేళ ఢిల్లీలో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. ఉగాండా నుంచి వచ్చిన మహిళ ఎయిర్ పోర్టులో అనుమానస్పదంగా కనిపించడంతో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. మాత్రల రూపంలో ఉన్న కొకైన్‌ను ఆమె కడుపులో దాచినట్టు గుర్తించారు. మొత్తం 91 కొకైన్ క్యాప్సుల్స్ ని ఆమె మింగినట్లు అధికారులు పేర్కొన్నారు. మహిళను అరెస్ట్ చేశారు. కొకైన్ ను కడపులో దాచి దేశంలో అక్రమంగా రవాణాకు పాల్పడతున్నట్లు గుర్తించారు అదికారులు.

2. మొత్తం 992 గ్రాముల కొకైన్ సీజ్
ఉగాండా మహిళను అరెస్ట్ చేసి కస్టమ్స్ అధికారులు ఆర్ఎల్ఎమ్ ఆస్పత్రికి తరలించారు. వైద్య నిపుణుల పర్యవేక్షణలో ఆమె కడుపులో నుంచి కొకైన్ పిల్స్ ను బయటకు తీశారు. పొత్తికడుపులోని ప్లాస్టిక్ కవర్‌లో వీటిని దాచింది. ఒక్కొక్క కవర్‌లో 9 గ్రాముల చొప్పున ఉండేలా మొత్తం 91 పిల్స్ కడుపులో ఉన్నట్లు అధికారుల తెలిపారు. మొత్తం 992 గ్రాముల కొకైన్‌ను సీజ్ చేశారు. వీటి మొత్తం విలువ రూ. 845 కోట్లు ఉంటుందని కస్టమ్స్ అధికారులు వెల్లడించారు.
3. హెరాయిన్ పట్టివేత
వారం రోజుల క్రితం కూడా ఢిల్లీ ఎయిర్ పోర్టులోనే ఉగాండా దేశం నుంచి వచ్చిన మహిళను కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. ఆమె నుంచి 2020 గ్రాముల హెరాయిన్ ను స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ సుమారు రూ.14.14 కోట్ల ఉంటుందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఒక్క ఢిల్లీ ఎయిర్ పోర్టులోనే 100 కేజీల హెరాయిన్ ను స్వాధీనం చేసుకున్నారు. దేశ వ్యాప్తంగా ఈ ఏడాది 15 వేల కోట్ల విలువైన మారక ద్రవ్యాలను అధికారులు సీజ్ చేశారు.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !!












Click it and Unblock the Notifications