ఆపరేషన్ మధ్యలో ఆపి నర్సుతో శృంగారం చేసిన డాక్టర్ ..కామ పిశాచి
వైద్య వృత్తి అంటే ప్రజల ప్రాణాలు కాపాడే ఒక ఉన్నతమైన బాధ్యత. కానీ యూకేలోని మాంచెస్టర్‌కు చెందిన ఒక పాకిస్థానీ డాక్టర్ చేసిన పని వృత్తికే కళంకం తెచ్చింది. ఆష్టన్-అండర్-లైన్‌లోని టేమ్‌సైడ్ ఆసుపత్రిలో ఒక రోగికి సర్జరీ చేస్తుండగా, మధ్యలోనే ఆపరేషన్ ఆపి, అదే ఆపరేషన్ థియేటర్‌లో ఒక నర్సుతో లైంగిక సంబంధం పెట్టుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు.
ఈ షాకింగ్ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు బయటకు వచ్చాయి. ఆపరేషన్ మధ్యలో డాక్టర్ కంఫర్ట్ బ్రేక్ కావాలని చెప్పి, మరో నర్సుని రోగికి కాపలాగా ఉంచాడు. ఈ నిర్వాకం తర్వాత, ఈ ఘటనపై విచారణ జరిగింది. విచారణలో, డాక్టర్ తన చర్యలకు కారణం వైవాహిక జీవితంలోని ఒత్తిడి అని చెప్పడం మరింత విమర్శలకు దారితీసింది.

డాక్టర్ చేసిన ఈ బాధ్యతారాహిత్యమైన పనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఒక రోగి ప్రాణాలతో పోరాడుతున్న సమయంలో, వైద్యుడు ఇలా ప్రవర్తించడం నైతిక విలువలను పూర్తిగా దిగజార్చడమే. ఈ సంఘటన వైద్య వృత్తి పట్ల ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని దెబ్బతీసేలా ఉంది. ప్రస్తుతం ఈ డాక్టర్ భవిష్యత్తుపై క్రమశిక్షణా ట్రిబ్యునల్ విచారణ చేపట్టింది. అతడి లైసెన్స్‌ను రద్దు చేయాలా వద్దా అనే విషయంపై త్వరలో నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications