• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మోడీ-షాపై ఉమా భారతి నిప్పులు: తల్లి కుమార్తె ఆత్మహత్యకు కారణం..బెయిల్ పై ఉన్న ఎమ్మెల్యేతో మద్దతా?

|

లక్నో: హర్యానాలో హంగ్ అసెంబ్లీ ఏర్పడిన నేపథ్యంలో..ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సంఖ్యాబలాన్ని సాధించడానికి భారతీయ జనతాపార్టీ స్వతంత్ర ఎమ్మెల్యేలపై ఆధారపడింది. ఇందులో తప్పు లేదు గానీ.. ఆ స్వతంత్ర ఎమ్మెల్యేల్లో ఒకరైన గోపాల్ కందా మద్దతును తీసుకోవడం పట్ల బీజేపీ సీనియర్ నాయకులు, కేంద్ర మాజీమంత్రి ఉమా భారతి నిప్పులు చెరుగుతున్నారు. బెయిల్ పై బయట తిరుగుతున్న వ్యక్తి మద్దతు పార్టీకి అవసరమా? అంటూ ఆమె ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాలను ప్రశ్నించారు.

ఈ మేరకు శుక్రవారం ఆమె వరుస ట్వీట్లను సంధించారు. తల్లి కుమార్తె ఆత్మహత్య చేసుకోవడానికి ప్రధాన కారకుడైన గోపాల్ కందాపై అనేక కేసులు ఉన్నాయని, అలాంటి వ్యక్తి మద్దతును తీసుకోవాల్సిన దుస్థితి పార్టీకి ఏర్పిడిందా? అని ప్రశ్నించారు. గోపాల్ కందా కేసు వ్యవహారం ఇంకా న్యాయస్థానంలో ఉందని, అతను బెయిల్ పై బయటికి వచ్చాడని చెప్పారు. బీజేపీకంటూ కొన్ని నైతిక విలువలు, కట్టుబాట్లు, నిబంధనలు ఉన్నాయని, అవే.. ఇతర రాజకీయ పార్టీల కంటే భిన్నంగా నిలిపాయని అన్నారు. అధికారం కోసం అడ్డదారులు తొక్కే అలవాటు బీజేపీకి ఆరంభం నుంచీ లేదని చెప్పారు.

Uma Bharti Warns BJP Against Taking Gopal Kanda’s Help in Haryana

హర్యానాలో తమ పార్టీ సారథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు కావాల్సిన అవసరం ఉందని, అలా కోరుకునే వారిలో తాను ముందంజలో ఉన్నానని అన్నారు. గోపాల్ కందా వంటి వ్యక్తి మద్దతును తీసుకోవడం సరికాదని అన్నారు. పార్టీని అధికారంలోకి తీసుకుని రావడానికి గోపాల్ కందా వంటి వ్యక్తుల అవసరం ఎంతమాత్రమూ లేదని చెప్పారు. అత్యున్నత విలువలు పాటించే నరేంద్ర మోడీ వంటి నాయకులు తమకు ఉన్నారని గుర్తు చేశారు. వారి ఛరిష్మాను చూసి ఎవ్వరైనా పార్టీకి మద్దుతు ఇస్తారని, అలాంటి పరిస్థితుల్లో గోపాల్ కందా మద్దతు తీసుకోవడంలో అర్థం లేదని అన్నారు.

గోపాల్ కందా నేరస్తుడా? లేక నిరపరాధా అనే విషయాన్ని న్యాయస్థానం తేల్చుతుందని, త్వరలోనే దీనికి సంబంధించిన తీర్పు వెలువడాల్సి ఉందని అన్నారు. ఎన్నికల్లో గెలవగానే గోపాల్ కందా పునీతుడైపోయాడని తాను భావించట్లేదని ఉమా భారతి చెప్పారు. ఎన్నికల్లో గెలవడానికి అనేక అంశాలు కారణమౌతాయని, డబ్బు వెదజల్లడం, ఓటర్లను భయభ్రాంతులకు గురి చేయడం వంటివి కూడా అందులో ఒకటని అన్నారు. ఇలాంటప్పుడు గోపాల్ కందా మద్దతును తీసుకోవడం మంచి పరిణామం కాదని, ఈ నిర్ణయంపై పునరాలోచించుకోవాలని సూచించారు.

English summary
In a series of tweets, senior BJP leader Uma Bharti has warned her party against taking support from rape accused leader Gopal Kanda in Haryana. "I have received information that we may get the support of an independent MLA named Gopal Kanda. I have something to say on this," she said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
X