వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోడలిపై మామ: జుట్టుపట్టుకొని, రోడ్డుపైకి తీసుకొచ్చి.. తిడుతుండగా, అత్త కర్రతో...

|
Google Oneindia TeluguNews

అత్త,మామ వేధిస్తున్నారని గృహహింస కేసు పెట్టడమే ఆమె పాపమైపోయింది. కేసు పెట్టడం ఏమో కానీ.. వారు అలాగే ప్రవర్తించారు. కోడలు అని కాదు కదా.. సాటి మనిషి అని చూడ చూడలేదు. మృగాళ్ల ప్రవర్తించారు. భర్త అంటే ఆవేశంలో ఉన్నాడు అని కాదు.. భార్య కూడా వంతుపాడింది. ఈ విదారకర ఘటన ఒడిశాలో జరిగింది.

జాజ్‌పూర్ జిల్లా ధానేశ్వర్‌కు చెందిన నవీన్ బహెర, అతని భార్య చారులత ఉంటున్నారు. వీరికి కుమారుడు ఉన్నారు. అతనికి పెళ్లైంది. అయితే కోడలి విషయంలో అత్త, మామలకు గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆమె వారిపై గృహ హింస కేసు నమోదు చేసింది. దీంతో అత్త, మామలు శివాలెత్తిపోయారు. తన కోడలిపై ప్రతీకారం తీర్చుకున్నారు. నడిరోడ్డు మీద దారుణంగా ప్రవర్తించారు.

uncle, anuty misbehave with daughter-in-law

కోడలిని మామ జట్టుపట్టి బయటకు తీసుకొచ్చాడు. రోడ్డుపై పడేశి కర్కశంగా ప్రవర్తించాడు. కోపంలో ఉన్న భర్తకు సర్దిచెప్పాల్సిన చారులత.. కర్రతో కోడలిపై తన ప్రతాపాన్ని చూపించింది. మామ కోడలిని తిడుతుండగా, అత్త కర్రతో కొట్టింది. తనను కొట్టొద్దని ప్రాధేయపడినా వినిపించుకోలేదు. దీంతో వారిని చూసి కోడలు గజ గజ వణికిపోయింది. ఈ ఘటనను కొందరు వీడియో తీశారు. దీంతో కేసును పోలీసులు సుమోటోగా స్వీకరించారు. అత్త, మామలపై కేసు నమోదు చేశారు.

English summary
Naveen Behera and his wife Charulata, residents of the village, were seen thrashing and abusing their daughter-in-law in public. While Naveen grabbed the victim by her hair and dragged her on the road, Charulata thrashed her with a stick.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X