కేంద్ర బడ్జెట్ 2023: వేగవంతమైన బడ్జెట్ వార్తలు, విశ్లేషణలు లైవ్‌లో మీ డైలీహంట్‌పై..!
2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ను ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్‌పై సామాన్యులు, మధ్యతరగతి కుటుంబాలు, ఉద్యోగస్తులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే ఈ బడ్జెట్‌లో నిర్మలమ్మ ఎవరిని కరుణిస్తుంది, ఎవరికి వాత పెడుతుంది అనే అంశం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇప్పటికే బడ్జెట్ తయారైపోయింది. బడ్జెట్ ప్రక్రియ ప్రారంభానికి ముందు ఆనవాయితీగా వచ్చే హల్వా కార్యక్రమం కూడా ఘనంగా జరిగింది. ఇక ఏటా ప్రవేశపెట్టే బడ్జెట్ దేశ ఆర్థిక క్యాలెండర్‌లో ముఖ్య భూమిక పోషిస్తుంది.
2024 సాధారణ ఎన్నికలకు ముందు పూర్తిస్థాయిలో ప్రవేశపెట్టే బడ్జెట్ ఇది కావడంతో అందరి దృష్టి ఈ 2023-24 బడ్జెట్‌పై ఉంది. ఇక బడ్జెట్ సమావేశాలు కూడా చాలా వాడీవేడీగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కరోనా సమయంలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో చాలా రంగాల్లో కోతలున్నాయి. అయితే ప్రస్తుతం కరోనా నుంచి కోలుకుని ఆర్థిక వ్యవస్థ గాడిలో పడిన కారణంగా ఈ సారి బడ్జెట్ పై పెద్ద అంచనాలే ఉన్నాయి. బడ్జెట్ సమావేశాలు జనవరి 31 నుంచి ప్రారంభం అవుతాయి. ఇటు అధికార పక్షం అటు విపక్షాల మధ్య మాటల యుద్ధం వాడీవేడీగా కొనసాగే అవకాశం ఉంది. ఈ సమావేశాలు ఏప్రిల్ 6వరకు కొనసాగుతున్నాయి.

ఇక వాడీవేడీగా సాగనున్న బడ్జెట్ సమావేశాలకు సంబంధించి పూర్తి స్థాయి కవరేజ్‌ను మీ డైలీ హంట్ పై పొందండి. ఎప్పటికప్పుడు రియల్‌లైమ్ అప్‌డేట్స్, వార్తలు, బడ్జెట్ పై విశ్లేషణలు లైవ్‌లో పొందండి .












Click it and Unblock the Notifications