Model Tenancy Actకు కేంద్రం ఆమోదం.. ప్రైవేట్ చేతికి అద్దె ఇళ్లు కూడా..
నమూనా అద్దె చట్టానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. బుధవారం ప్రధానమంత్రి నరేంద్రమోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశమైంది. దేశంలోని అన్ని ఆదాయ వర్గాల వారికి తగిన రీతిలో అద్దె ఇళ్లను అందుబాటులోకి తేవడం, అద్దె ఇళ్ల మార్కెట్‌ను స్థిరీకరించడం లక్ష్యంగా ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. దీంతో దేశంలో అద్దె గృహాల్లో ఉండే వారికి చట్టపరమైన హక్కును కల్పించేందుకు కేంద్రం నిర్ణయించింది.
ప్రస్తుతం సంస్థాగతంగా ఉంటున్న అద్దె ఇళ్లు.. ఈ చట్టంతో వ్యవస్థాగతంగా మారే అవకాశం ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఖాళీగా ఉన్న భవనాలను అద్దెకు ఇచ్చే వెసులుబాటుతో పాటు ప్రైవేటు రంగానికి వ్యాపారావకాశాలను కల్పించేదిగా ఉపయోగపడనుంది. ప్రైవేటు భాగస్వామ్యంతో పెద్ద మొత్తంలో గృహాలు నిర్మించి వాటిని అద్దెకు ఇవ్వడం ద్వారా ఇది వ్యాపారంగా విస్తరిస్తుందని కేంద్రం పేర్కొంది.

రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు.. తాజాగా ఆమోదం పొందిన బిల్లును అమలు చేయడం లేదా ఇప్పటికే ఉన్న అద్దె చట్టాలను తగిన విధంగా సవరించాలని కేంద్రం కోరింది. దీంతో అవీ చట్టాల్లో మార్పు చేయనుంది. ప్రైవేట్ సెక్టార్ భారీగా గృహలు నిర్మించి.. అద్దెకు ఇవ్వనున్నారు. గృహావసరాలతోపాటు.. వ్యాపార వాణిజ్య సముదాయాలు కూడా అందులో ఉంటాయి.












Click it and Unblock the Notifications