Education Loan: కేంద్రం సరికొత్త పథకం- బెనిఫిట్స్, అర్హతలు ఇవే

Vidyalakshmi scheme: ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సంకీర్ణ కూటమి శుభవార్తను వినిపించింది. ఆర్థిక అడ్డంకులను తొలగించడానికి ఉద్దేశించిన ప్రధానమంత్రి విద్యాలక్ష్మి పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

ఈ పథకం కింద ఉన్నత విద్యాసంస్థల్లో చేరిన విద్యార్థులకు ఎలాంటి పూచీకత్తు గానీ, గ్యారంటీ గానీ లేకుండా రుణాలు పొందే వీలును కల్పించింది. పీఎం- విద్యాలక్ష్మి పథకం కింద సంవత్సరానికి 1,00,000 మంది విద్యార్థులు తమ ఉన్నత స్థాయి చదువుల కోసం రుణాలను పొందవచ్చు.

Union Cabinet approves PM Vidyalaxmi scheme

వార్షిక ఆదాయం 8 లక్షల రూపాయల వరకు ఉన్న కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ఈ పీఎం- విద్యాలక్ష్మి పథకం కింద మూడు శాతం వడ్డీ రాయితీతో 10 లక్షల రూపాయల వరకు రుణాలపై తీసుకోవచ్చు. వార్షిక ఆదాయం నాలుగున్నర లక్షల రూపాయల వరకు కుటుంబాలకు చెందన విద్యార్థులకు పూర్తి వడ్డీ రాయితీ లభిస్తుంది.

దీనితోపాటు- ఏడున్నర లక్షల రూపాయల వరకు విద్యార్థులు తీసుకున్న రుణాల విషయంలో బకాయిలు ఏవైనా ఉంటే వాటిని తీర్చడానికి 75 శాతం బ్యాలెన్స్ మొత్తాన్ని కవర్ చేసే క్రెడిట్ గ్యారెంటీ వెసలుబాటును కూడా ఈ పథకంలో అందుబాటులో తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం.

అర్హులైన విద్యార్థులు తమ పేర్లను నమోదు చేసుకోవడానికి, రుణం కోసం దరఖాస్తులను దాఖలు చేయడానికి, వడ్డీ మొత్తాన్ని చెల్లించడానికీ కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా పీఎం-విద్యాలక్ష్మి పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. రుణాల మంజూరు ప్రక్రియ మొత్తం కూడా ఈ పోర్టల్ ద్వారానే కొనసాగుతుంది.

పీఎం- విద్యా లక్ష్మి పథకాన్ని అమలు చేయడానికి దేశవ్యాప్తంగా గల అనేక విద్యాసంస్థలను కేంద్ర ప్రభుత్వం వడపోయాల్సి ఉంది. దీనికి సంబంధించిన జాబితాను నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ రూపొందిస్తుంద. ఇందులో వివిధ కేటగిరీలలో ర్యాంకులు పొందిన టాప్ 100 సంస్థలు, రాష్ట్ర/కేంద్ర పాలిత ప్రభుత్వాలకు చెందిన టాప్ 200 కళాశాలలు ఉంటాయి.

ఉన్నత స్థాయి చదువులు చదవాలని భావించినప్పటికీ దానికి అనుగుణంగా ఆర్థిక స్థోమత లేని విద్యార్థులకు ఈ విద్యాలక్ష్మి పథకం ఓ వరంగా మారుతుందని కేంద్ర సమాచార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. మంత్రివర్గ సమావేశం ముగిసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. కేబినెట్‌లో తీసుకున్న నిర్ణయాలు, ఆమోదించిన తీర్మానాల గురించి వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+