రాహుల్ గాంధీ నకిలీ హిందూత్వవాది, ప్రజలు పిచ్చోళ్లా, గుడికి పోతే ? కేంద్ర మంత్రి ఫైర్!

Posted By:
Subscribe to Oneindia Telugu

బెంగళూరు: కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఓ నకిలీ హిందూత్వవాది అంటూ కేంద్ర మంత్రి అనంత్ కుమార్ హెగ్డే మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలో పర్యటించిన రాహుల్ గాంధీ తాను హిందువు అని చెప్పడం విడ్డూరంగా ఉందని కేంద్ర మంత్రి అనంత్ కుమార్ హెడ్డే సంచలన వ్యాఖ్యలు చేశారు.

హిందువు అంటే!

హిందువు అంటే!

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు నాలుగు రోజుల పాటు కర్ణాటకలో శాసన సభ ఎన్నికల ప్రచారం చేసి ఢిల్లీ వెళ్లిన విషం తెలిసిందే. ఈ విషయంపై స్పంధించిన కేంద్ర మంత్రి అనంత్ కుమార్ హెగ్డే రాహుల్ గాంధీ ఒక ఖోటా హిందూత్వవాది (నకిలీ హిందూత్వవాది), తాను హిందువు అంటే సరిపోతుందా అని అన్నారు.

చేపలు, చికెన్

చేపలు, చికెన్

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఇటీవల ఆలయాలు సందర్శించి మేము హిందువులు అని గొప్పగా చెప్పాకున్నారని కేంద్ర మంత్రి అనంత్ కుమార్ హెగ్డే ఎద్దేవ చేశారు. చేపలు, చికెన్ తిని ఆలయాలకు వెళ్లకుండాదని, హిందువు లాగా ప్రవర్థిస్తే ప్రజలు వారిని నమ్ముతారని అనంత్ కుమార్ హెగ్డే చెప్పారు.

ఆర్ఎస్ఎస్ కు 70 ఏళ్ల చరిత్ర

ఆర్ఎస్ఎస్ కు 70 ఏళ్ల చరిత్ర

ఆర్ఎస్ఎస్ నాయకులు, కార్యకర్తలు గత 60-70 ఏళ్ల నుంచి హిందూత్వం గొప్పదనం గురించి ప్రజలకు వివరిస్తున్నారని, హిందువులు ఎంత గొప్పవారో ప్రపంచానికి చాటి చెబుతున్నారని కేంద్ర మంత్రి అనంత్ కుమార్ హెగ్డే అన్నారు.

వారం రోజుల హిందువులు

వారం రోజుల హిందువులు

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య సంవత్సరంలో వారం రోజులు ఆలయాలు సందర్శించి తాము హిందూత్వవాదులు అని చెప్పుకుంటున్నారని, వారు నకిలీ హిందూత్వవాదులని కేంద్ర మంత్రి అనంత్ కుమార్ హెగ్డే ఆరోపించారు.

కాంగ్రెస్ ఫినిష్

కాంగ్రెస్ ఫినిష్

కేంద్ర మంత్రి అనంత్ కుమార్ హెగ్డే ఆయన ట్వీట్టర్ లో ఓ పోస్టు పెట్టారు. రాగా బాతు గుండురావ్ మాతు కాంగ్రెస్ ముగితు ( రాహుల్ గాంధీ మాటలు, గుండూరావ్ మాట, కాంగ్రెస్ మునిగింది) అని పోస్టు చేశారు. నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలతో మీడియాలో ప్రచారంలో ఉంటున్న కేంద్ర మంత్రి అనంత్ కుమార్ హెగ్డే మరోసారి రాహుల్ గాంధీ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Union Minister Anant Kumar Hegde on Feb 15th took a jibe at Congress President Rahul Gandhi and called him a 'Khota Hindutvawadi' (Fake Hindu). Hegde's statement comes in the backdrop of Rahul's visit to temples in Karnataka ahead of the assembly elections.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి