వామ్మో, ఎలా వచ్చాడు.. విమానం ఎగిరే సమయంలో.. రన్ వే పైకి..!

ముంబై : ఎయిర్‌పోర్టులో కలకలం రేగింది. కొద్దిసేపట్లో టేకాఫ్‌కు రెడీగా ఉన్న విమానం దగ్గర గుర్తు తెలియని వ్యక్తి కనిపించడం అలజడి రేపింది. సాధారణంగా విమానాలు టేకాఫ్ అయ్యే సమయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు ఎయిర్‌పోర్టు సిబ్బంది. ఆ క్రమంలో అపరిచితుడు ఏకంగా రన్ వే పైకి ఎంట్రీ ఇవ్వడం చర్చానీయాంశమైంది.

ముంబై నుంచి బెంగళూరుకు బయలుదేరేందుకు స్పైస్ జెట్ విమానం సిద్దమైన తరుణంలో గుర్తు తెలియని వ్యక్తి రన్ వే పై షికార్లు కొట్టాడు. అటు ఇటు తిరుగుతూ విమానం ఇంజిన్ దగ్గరకు వెళ్లాడు. అంతేకాదు విమానం టైర్లను తాకుతూ ఏదో చేసినట్లుగా అనుమానాస్పదంగా వ్యవహరించాడు. అయితే అతడి కదలికలను గమనించిన పైలట్ వెంటనే అప్రమత్తమయ్యారట. అపరిచిత వ్యక్తి అక్కడ తచ్చాడుతుండటంతో ఇంజిన్‌ను ఆఫ్ చేసి వెంటనే భద్రతా అధికారులకు సమాచారం అందించారు.

unknown person roaming on run way at mumbai airport

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ముంబై ఎయిర్‌పోర్టులో గుర్తు తెలియని వ్యక్తి సంచారంపై బాలీవుడ్ నటి గుల్ పనాగ్ ట్విట్టర్ వేదికగా వీడియో పోస్ట్ చేశారు. అతడు రన్ వే పైకి ఎలా రాగలిగాడు.. సీఐఎస్‌ఎఫ్ భద్రతా దళాలు ఏం చేస్తున్నాయి.. అతడు అలా ఇంజిన్ దగ్గరకు అంత ఫ్రీ గా వెళ్లడం నమ్మలేకపోతున్నా.. అంటూ ట్వీట్ చేశారు.

ఎలుకలు బాబోయ్.. అక్కడ భయపడటం లేదు.. కొనుక్కొంటున్నారు..!

సదరు అపరిచిత వ్యక్తి ఆకస్మాత్తుగా ఎయిర్‌పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఘటనపై విమానాశ్రయ అధికారులు స్పందించారు. అతడి మానసిక స్థితి సరిగా లేదని చెప్పుకొచ్చారు. ఎయిర్‌పోర్టు గోడ దూకి లోనికి వచ్చినట్లుగా వెల్లడించారు. మొత్తానికి ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకోవడంతో ఇటు విమానాశ్రయ సిబ్బందితో పాటు ప్రయాణీకులు ఊపిరి పీల్చుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+