ఉన్నావ్ అత్యాచార కేసులో ఊహించని మలుపు.. రోడ్డెక్కిన బాధితురాలు!
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావ్ అత్యాచార కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన దోషి, బహిష్కృత బీజేపీ నేత కుల్దీప్ సింగ్ సెంగార్‌కు ఢిల్లీ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. డిసెంబర్ 23, 2025న జస్టిస్ సుబ్రమణ్యం ప్రసాద్, జస్టిస్ హరీష్ వైద్యనాథన్ శంకర్ నేతృత్వంలోని ధర్మాసనం కుల్దీప్ సెంగార్ శిక్షను నిలిపివేస్తూ బెయిల్ మంజూరు చేసింది. ఆయన అప్పటికే 7 ఏళ్ల 5 నెలల జైలు శిక్ష అనుభవించినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు న్యాయస్థానం పేర్కొంది.
బెయిల్ కోసం షరతులు
అయితే బెయిల్ కోసం కోర్టు కఠినమైన షరతులు విధించింది. రూ. 15 లక్షల వ్యక్తిగత బాండ్, ముగ్గురు షూరిటీలు సమర్పించాలి. బాధితురాలి నివాసానికి 5 కిలోమీటర్ల పరిధిలోకి వెళ్లకూడదు. బాధితురాలిని లేదా ఆమె తల్లిని బెదిరించకూడదు. తన పాస్‌పోర్టును కోర్టులో అప్పగించాలి. ప్రతి సోమవారం పోలీస్ స్టేషన్‌లో రిపోర్ట్ చేయాలి. కుల్దీప్ సెంగార్ తండ్రి కస్టోడియల్ మరణం కేసులో ఇంకా 10 ఏళ్ల శిక్ష అనుభవిస్తున్నందున, ఆ కేసులో బెయిల్ వచ్చే వరకు ఆయన జైలులోనే ఉండాల్సి ఉంటుంది.

ఇండియా గేట్ వద్ద బాధితురాలి నిరసన
కోర్టు తీర్పు వెలువడిన వెంటనే బాధితురాలు, ఆమె తల్లి, సామాజిక కార్యకర్త యోగితా భయానాతో కలిసి మంగళవారం రాత్రి ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద ఆందోళనకు దిగారు. తమకు అన్యాయం జరిగిందని, ఈ తీర్పు తన కుటుంబాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తుందని బాధితురాలు కన్నీటి పర్యంతమైంది. "ఎన్నికలు వస్తున్నాయి కాబట్టే ఆయనను బయటకు వదిలేశారు" అని ఆమె ఆరోపించింది. ఢిల్లీ పోలీసులు ఆమెను అక్కడి నుంచి బలవంతంగా తొలగించి, బస్సులో తరలించారు. ఈ క్రమంలో తోపులాట కూడా జరిగింది.
సుప్రీం కోర్టును ఆశ్రయిస్తాం: బాధితురాలు
హైకోర్టు నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేసిన బాధితురాలు, తనకు సుప్రీంకోర్టుపై నమ్మకం ఉందని, సెంగార్ బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని స్పష్టం చేసింది.
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications