Viral Video: వామ్మో.. ఆమె టీచర్ కాదు రాక్షసి.. చిన్నారి కొట్టిన తీరు చూస్తే షాక్ అవ్వాల్సిందే..
తల్లిదండ్రుల తర్వాత పిల్లలకు ఉపాధ్యాయులే మార్గదర్శకులుగా ఉంటారు. గురువు చెప్పిన మంచితో ఎంతో ఎత్తుకు ఎదుగుతారు. కానీ కొంత మంది ఉపాధ్యాయులు ప్రవర్తించే తీరు వారి వృత్తికే కలంకం తెస్తోంది. ఓ ఉపాధ్యాయురాలు పిల్లల్ని దండించిన వీడియో చూస్తే ఓళ్లు వణికిపోతోంది. అంత ఘోరంగా ఓ చిన్నారిని ఉపాధ్యాయురాలు కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ దారుణ ఘటన ఉత్తర ప్రదేశ్‌లో జరిగింది.

అల్లరి చేసిందని..
యూపీలోని ఉన్నావ్ జిల్లా అసోహా మండలం ఇస్లామ్ నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రభుత్వ పాఠశాలలో శిక్షా మిత్ర .. ఓ చిన్నారిని దారుణంగా కొట్టిన తీరు ఆందోళన కలిగించేలా ఉంది. క్లాస్ రూమ్ అల్లరి చేసిందని, హోం వర్క్ చేయలేదన్న కారణంతో ఐదేళ్ల చిన్నారి జుట్టు పట్టుకుని ఎడా పెడా చెంప దెబ్బలు కొట్టింది. చిన్నారి బోరున ఏడుస్తున్నా.. ఆ ఉపాధ్యాయురాలు కనికరించలేదు కదా.. కొట్టడం ఎక్కువ చేసింది.

టీచర్ పై ఆగ్రహం
ఈ ఘటన జూలై 9వ తేదీన చోటుచేసుకోగా.. అదే రోజు సాయంత్రం బాలిక తల్లిదండ్రులు చిన్నారి ముఖంపై దెబ్బలు గుర్తించి.. మరుసటి రోజు పాఠశాలకు వెళ్లి ఉపాధ్యాయురాలిని నిలదీశారు. మరోసారి ఇలా జరిగితే బాగుండని హెచ్చరించారు. టీచర్ తో హామీ లేఖ రాయించుకున్నారు.చిన్నారిని కొడుతున్నప్పుడు ఎవరో కిటికీ నుంచి వీడియో తీశారు.
విద్యా శాఖ చర్యలు
ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో వైరల్ అయి పెద్ద ఎత్తున ఆందోళనలు వ్యక్తం అయ్యాయి. దీంతో ఈ ఘటనపై విద్యాశాఖ అధికారులు స్పందించారు. టీచర్‌ను ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడ్ని సస్పెండ్ చేశారు. పోలీసులు ఉపాధ్యాయురాలిపై కేసు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications