Chhattisgarh High Court: భార్య అనుమతి లేకుండా అసహజ లైంగిక చర్య నేరం కాదు..

Chhattisgarh High Court: భార్య అనుమతి లేకుండా భర్త అసహజ లైంగిక చర్యకు పాల్పడడం నేరం కాదని ఛత్తీస్ గఢ్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. భార్యకు 15 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు లేని పక్ష్యంలో అత్యాచారం కాదని పేర్కొంది. భర్త తన భార్యతో సమ్మతితో లేదా అనుమతి లేకుండా లైంగిక సంబంధం కలిగి ఉంటే అత్యాచారం లేదా అసహజ లైంగిక చర్యలకు పాల్పడినట్లు అభియోగాలు మోపబడవని ఛత్తీస్గఢ్ హైకోర్టు సోమవారం పేర్కొంది. లైంగిక సంబంధం లేదా అసహజ లైంగిక సంబంధంలో భార్య సమ్మతిని కలిగి ఉండడం చాలా తక్కువ అని జస్టిస్ నరేంద్ర కుమార్ వ్యాస్ సింగిల్ బెంచ్ ధర్మాసనం అభిప్రాయపడింది.

"భార్య 15 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు లేని పక్షంలో, భర్త తన భార్యతో చేసే ఏదైనా లైంగిక సంపర్కం లేదా లైంగిక చర్యను అత్యాచారంగా పరిగణించలేమని స్పష్టంగా తెలుస్తుంది. అసహజ చర్యకు భార్య సమ్మతి లేకపోవడం దాని ప్రాముఖ్యతను కోల్పోతుంది కాబట్టి, అప్పీల్ దారుడిపై ఐపీసీ సెక్షన్లు 376, 377 కింద నేరం నిరూపించబడదని ఈ కోర్టు అభిప్రాయపడింది" అని జస్టిస్ నరేంద్ర కుమార్ వ్యాస్ నేతృత్వంలోని సింగిల్ బెంచ్ పేర్కొంది.

Unnatural Physical Relation by Husband Without Wife Consent is not Crime Says Chhattisgarh High Court

అసలు విషయం ఏంటంటే?
కోర్టులో అప్పీలుదారుడు మరెవరో కాదు మరణించిన బాధితురాలి భర్త. అప్పీలుదారుడు(భర్త) బాధితురాలి సమ్మతికి విరుద్ధంగా ఆమెతో అసహజ లైంగిక సంబంధం పెట్టుకున్నాడు. బాధితురాలికి నొప్పిగా ఉందని ఫిర్యాదు చేయడంతో ఆస్పత్రిలో చేర్చాడు. ఆమె ఆరోగ్యం క్షీణించింది. ఈ క్రమంలో బాధితురాలి మరణ వాంగ్మూలాన్ని ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ నమోదు చేశారు. తన భర్త బలవంతపు లైంగిక సంబంధం కారణంగా తాను అనారోగ్యానికి గురయ్యానని బాధితురాలు పేర్కొంది. ఆ తర్వాత బాధితురాలు అదే రోజు ప్రాణాలు విడిచింది. ట్రయల్ కోర్టు భర్తను సెక్షన్ 377, 376, 304 కింద నేరాలకు పాల్పడినట్లు నిర్ధారించింది. ట్రయల్ కోర్టు భర్తకు 10 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. దీనికి వ్యతిరేకంగా భర్త హైకోర్టులో అప్పీలు దాఖలు చేశాడు.

కోర్టు ఏం చెప్పిందంటే.. ?
భార్య వయస్సు 15 సంవత్సరాల కంటే తక్కువ కాకపోతే భర్త చేసే ఏదైనా లైంగిక చర్యను ఎట్టి పరిస్థితుల్లో అత్యాచారంగా పరిగణించలేమని కోర్టు తన తీర్పులో పేర్కొంది. ఈ విధంగగా అసహజ చర్యకు భార్య అనుమతి లేకపోవడం దాని ప్రాముఖ్యతను కోల్పోతుందని తెలిపింది. కాబట్టి ఐపీసీ సెక్షన్లు 376, 377 కింద అప్పీలుదారునిపై నేరం మోపబడదని కోర్టు అభిప్రాయపడింది. ఇది ఈ కోర్టు జోక్యానికి అర్హమైనదని కోర్టు పేర్కొంది. ఈ కారణంగా కోర్టు అప్పీలుదారుడిని అన్ని ఆరోపణల నుంచి నిర్ధోషిగా విడుదల చేసింది. భర్తను జైలు కస్టడీ నుంచి వెంటనే విడుదల చేయాలని కోర్టు ఆదేశించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+