అన్నాదమ్ములిద్దరినీ ఒకేసారి పెళ్లి చేసుకుంది.. బై వన్ గెట్ వన్ అన్నమాట.
సాధారణంగా భారతీయ సంప్రదాయాల్లో ఒక వ్యక్తి ఒకరిని మాత్రమే పెళ్లి చేసుకుంటారు. అయితే హిమాచల్ ప్రదేశ్ లోని ఓ యువతి మాత్రం అన్నాదమ్ములిద్దరినీ ఒకేసారి పెళ్లి చేసుకుని అందర్నీ ఆశ్చర్య పరిచింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియా, ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. ఇద్దరినీ ఎలా ఒప్పించావ్ అంటూ నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఆ విశేషాలను ఇక్కడ చూడండి.
భారతదేశం అంటేనే భిన్నత్వంలో ఏకత్వం. ఎన్నో కులాలు, మతాలు, తెగలు, సంప్రదాయాల కలయిక. మన దేశంలో అనేక సంప్రదాయాలు ఉన్నాయి. ఓ వైపు ఏఐ యుగం వచ్చినా ఆ పురాతన సంప్రదాయాలను కొన్ని తెగలు ఇప్పటికీ పాటిస్తూనే ఉంటాయి. అదే తెగలో పుట్టి ఉన్నత చదువులు చదువుకున్న యువతీయువకులు కూడా ఇప్పటికీ ఈ సంప్రదాయాలను గౌరవిస్తూ పాటిస్తున్నారు. ఈ క్రమంలోనే హిమాచల్ ప్రదేశ్ లోని ఒక పురాతన ఆచారం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
🇮🇳 Unusual News from India
— Unpopular (@news_unpopular) July 19, 2025
In a village in Himachal Pradesh, a woman recently married two brothers — continuing the age-old Hattee tradition of polyandry.
The custom, rooted in practicality and land preservation, allows brothers to share one wife, keeping family property… pic.twitter.com/asj6v8Noml
అదే హట్టి పాలియాండ్రీ సంప్రదాయం. సంప్రదాయం ప్రకారం అక్కడ ఇద్దరు అన్నాదమ్ములు ఒకే యువతిని ఒకే వేదికపై ఒకేసారి వివాహం చేసుకోవాలి. అయితే ఆ తెగలోని సునిత చౌహాన్ అనే యువతి అలాగే ఒకే వేదికపై ఒకేసారి ఇద్దరు అన్నాదమ్ములు అయిన ప్రదీప్ నేగి, కపిల్ నేగిలను పెళ్లి చేసుకుని అందరినీ ఆశ్చర్య పరిచింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ప్రదీప్ నేగి, కపిల్ నేగీ లది సిర్ మౌర్ జిల్లాలోని షిల్లాయ్ గ్రామం కాగా.. సునిత చౌహాన్ ది స్థానికంగా ఉన్న కూన్హత్ గ్రామం.

హిమాచల్ ప్రదేశ్ లోని ఈ సంప్రదాయాన్ని జోడిధారణ లేదా ద్రౌపది ప్రాథ అని పిలుస్తుంటారు. ఈ సంప్రదాయంలో అన్నాదమ్ములు ఒకే భార్యను పెళ్లి చేసుకుంటారు. అలా ఆమెతో భాగస్వామ్యం పంచుకుంటారు. ఈ వివాహ వేడుకను 3 రోజుల పాటు ఘనంగా నిర్వహించారు. పాహరి సంప్రదాయ పాటలు, డ్యాన్స్‌ల తో పెళ్లికి వచ్చిన అతిథులు బంధుమిత్రులంతా పెళ్లి వేడుకను అట్టహాసంగా సెలబ్రేట్ చేసుకున్నారు.
-
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది












Click it and Unblock the Notifications