యూపీలో బీజేపీ విక్టరీ వెనక తెలుగు నేత.. ఎవరతను.. ఏం చేశారు
ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీకి క్లిస్టర్ క్లియర్ మెజార్టీ వచ్చింది. గతంలో కన్నా సీట్లు మాత్రం తగ్గాయి. కానీ యోగి ఇమేజ్, మోడీ ప్రభ మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. యూపీలో బీజేపీ విజయానికి కారణం ఎవరూ.. ప్రభుత్వ వ్యతిరేకత లేదా..? ఉన్న కానీ జనం నాడీ పట్టి మరీ ప్రచారం చేశారా..? అయితే ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఓ తెలుగు వ్యక్తి.. అదే బీజేపీ నేత లెండి.. కీ రోల్ పోషించరట.. ఆ వివరాలు ఎంటో తెలుసుకుందాం. పదండి.

ఆనలిస్టులు, నేతలు
యూపీలో బీజేపీకి ప్రచార అస్త్రాలు మోడీ.. యోగి.. వీరిద్దరి వల్లే ఆ పార్టీ మనగలుగుతుంది. నిజానికి యోగి వచ్చాక యూపీలో క్రైమ్ రేట్ తగ్గిందట. అంతకుముందు పరిస్థితి మరోలా ఉండేంది. కానీ ఇప్పుడు మొత్తం సీన్ మారిపోయింది. వీరికి ఆనలిస్టులు.. నేతల సహకారం లభించింది. యూపీ ఎన్నికల్లో తెలుగు వ్యక్తి సత్య కుమార్ కీలక పాత్ర పోషించారు. ఈయన బీజేపీ జాతీయ కార్యదర్శి.. యూపీ బీజేపీ కో ఇంచార్జీగా పనిచేస్తున్నారు.

తెలుగు వ్యక్తి..
ఇక్కడ 403 అసెంబ్లీ స్థానాలు ఉన్న సంగతి తెలిసిందే. అయితే వాటిలో సత్యకుమార్ 135 స్థానాలకు బాధ్యులు. ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక, ప్రచార వ్యుహం, బూత్ స్థాయి నుంచి పార్టీ బలోపేతం వంటి అంశాలపై దృష్టిసారించారు. క్షేత్రస్థాయిలో పరిశీలించడంతో.. ప్రజల నాడీని తెలుసుకోగలిగారు. అందుకే బీజేపీ 262 చోట్ల లీడ్‌లో ఉందంటే.. సత్యకుమార్ పని తనం తప్పకుండా ఉంది. కీలక నేతల ఇమేజీ ఉన్నప్పటికీ.. సత్యకుమార్ వాటిని ఓటుగా మలిచారు.

మోడీ హవా కూడా..
యూపీలో కూడా మోడీ గట్టిగానే ప్రచారం చేశారు. అలాగే యోగి ప్రభుత్వం చేపట్టిన పథకాలు.. నేరస్తులపై కఠిన చర్యలు కూడా ఆ పార్టీకి బూస్టింగ్‌గా మారాయి. దీంతో వార్ వన్ సైడ్ జరిగి.. కమలం వికసించింది. యూపీలో గెలవడం అన్నీ పార్టీలకు ఇంపార్టెంట్.. యోగి ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంటుందని అనుకున్నారు. అఖిలేశ్ యాదవ్.. తెగ కష్టపడ్డారు. కానీ ప్రతిపక్షానికే పరిమితం కావాల్సి వచ్చింది.
కాంగ్రెస్ కూడా గట్టిగానే ప్రచారం చేసింది. ప్రియాంకు బాధ్యతలు అప్పగించారు. ఒకనొక క్రమంలో సీఎం అని కూడా ప్రకటన చేశారు. తర్వాత నాలిక కరుచుకొని మిన్నకుండిపోయారు. కానీ ఆ పార్టీ యూపీలో సింగిల్ డిజిట్ రావడం శ్రేణులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఎన్ని సీట్లు వచ్చినా.. 10-20 కదా అంటున్నారు. బీఎస్పీ పరిస్థితి కూడా అదే.. అవును ఆ పార్టీ కూడా కాంగ్రెస్ మాదిరిగానే పరిస్థితి ఉంది. యోగి వైపు జనం మొగ్గు చూపారు.
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి












Click it and Unblock the Notifications