కాశీ విశ్వనాథుడి ఆలయంలో యూపీ సీఎం యోగీ... ఇక్కడే సరికొత్త రికార్డు..!
యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ కాశీ విశ్వనాథ్, కాల భైరవ ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.100 సార్లు ఈ ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించిన తొలి ముఖ్యమంత్రిగా యోగీ ఆదిత్యనాథ్ నిలిచారు.
వారణాసి: యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ కాశీ విశ్వనాథ్, కాల భైరవ ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.100 సార్లు ఈ ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించిన తొలి ముఖ్యమంత్రిగా యోగీ ఆదిత్యనాథ్ నిలిచారు.ఇక ఈ నగరంలో సీఎం హోదాలో యోగీ పర్యటించడం ఇది 113వ సారి కావడం విశేషం. 2017లో తొలిసారి ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సగటున 21 రోజులకు కాశీవిశ్వనాథ్, మరియు కాలభైరవ ఆలయాలను సందర్శించారని చెప్పొచ్చు. ప్రజల సంక్షేమం కోసం యోగీ ఆదిత్యనాథ్ ఈ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు.
ఇన్ని సార్లు యోగీ ఆదిత్యనాథ్ కాశీ విశ్వనాథుని ఆలయాన్ని సందర్శిస్తున్నారంటే ఆయనకు మన సనాతన ధర్మం పట్ల, బాబా విశ్వనాథ్ పట్ల ఎంతటి నమ్మకం విశ్వాసం ఉందో అర్థం చేసుకోవచ్చని ఆలయ పూజారి నీరజ్ కుమార్ పాండే చెప్పారు. నెలకోసారి సీఎం యోగీ ఆదిత్యనాథ్ కాశీ నగరంలో పర్యటిస్తారు. ఆ సమయంలో పలు సమీక్షలు నిర్వహించి, ఇక్కడ అభివృద్ధి పనులపై సమీక్ష చేస్తారు.

యోగీ ఆదిత్యనాథ్ 2017లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక ఇప్పటి వరకు విశ్వేశ్వ భగవంతుడిని 74 సార్లు దర్శించుకున్నారు. గతేడాది సెప్టెంబర్ 9వ తేదీన వారణాసిని 100వ సారి పర్యటించారు. ఆ సమయంలో కాశీ విశ్వనాథ్ ధామ్‌ను 88వ సారి సందర్శించారు. ఇక అప్పటి నుంచి మార్చి 18వ తేదీ వరకు ముఖ్యమంత్రి కాశీ విశ్వనాథుడి ఆలయంను 12సార్లు సందర్శించారు.

శనివారం రోజున కాలభైరవ ఆలయంలో సీఎం యోగీ ఢమరుకం కొడుతున్న ఓ చిన్నారితో ముచ్చటించారు.ఆ అబ్బాయి చదువు గురించి ఆరా తీశాడు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి హారతి పట్టారు. కాలభైరవ కాశీ కొత్వాల్‌గా అక్కడి స్థానికలు పిలుచుకుంటారు. రెండో రోజు పర్యటనలో భాగంగా సీఎం యోగీ కొత్తగా నిర్మించిన భవనాలపై సమీక్ష చేశారు. ఇక కాశీలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలపై కూడా సమీక్ష నిర్వహించిన సీఎం.. అధికారులకు సూచనలు సలహాలు సైతం ఇచ్చారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications