అఖిలేష్ 40 వేలు ఇస్తే.. యోగీ 50 వేలు..? యూపీ ఎన్నికల వేళ సంచలన హామీలు..!

ఉత్తర్ ప్రదేశ్ లో వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలు (UP Elections) 2029లో జరిగే సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్ లాంటివి. దీంతో ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలన్న పట్టుదలతో ఉన్న యోగీ ఆదిత్యనాథ్ నేతృత్వంలోని బీజేపీ సర్కార్.. ఇందుకోసం ఎంతవరకైనా వెళ్లేందుకు సిద్దమవుతోంది. ఇందులో భాగంగా తాజాగా మహిళలకు తాము గెలిస్తే రూ.40 వేలు ఇస్తామన్న ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ కు పోటీగా తాము 50 వేలు ఇస్తామనే హామీ ఇచ్చేందుకు యోగీ ఆదిత్యనాథ్ సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది.

అమిత్ షా పరువు నష్టం కేసు- రాహుల్ పై యూపీ కోర్టు కీలక తీర్పు..!
అమిత్ షా పరువు నష్టం కేసు- రాహుల్ పై యూపీ కోర్టు కీలక తీర్పు..!

యూపీలో ఈసారి ఎస్పీ అధికారంలోకి వస్తే స్త్రీ సమ్మాన్-సమృద్ది యోజన పేరుతో ఓ పథకాన్ని అమల్లోకి తెచ్చి అర్హులైన మహిళలకు 40 వేలు నగదు ఇస్తామని ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ తాజాగా ప్రకటించారు. దీంతో బీజేపీ ఆత్మరక్షణలో పడింది. ఎస్పీకి దీటుగా తాము గెలిస్తే మహిళలకు 50 వేలు ఇస్తామని ప్రకటించాలని యోగీ ఆదిత్యనాథ్ భావిస్తున్నారు. దీని సాధ్యాసాధ్యాలపై అధికారులతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో దీనిపై సీఎం యోగీ ఓ ప్రకటన చేసే అవకాశం ఉంది.

UP Elections 2029 40 50 - 40 50 50 18
బీజేపీకి మిత్రుల షాకులు- యూపీలో పోటీకి బీహారీలు- వ్యతిరేకిస్తున్న యూపీ ఫ్రెండ్..!
బీజేపీకి మిత్రుల షాకులు- యూపీలో పోటీకి బీహారీలు- వ్యతిరేకిస్తున్న యూపీ ఫ్రెండ్..!

బీజేపీ మహిళలకు 50 వేలు ఇస్తామని ప్రకటిస్తే వచ్చే ఎన్నికల్లో ఏకపక్షంగా విజయం సాధించవచ్చని బీజేపీ వ్యూహకర్తలు భావిస్తున్నారు. దీని వెనుక బలమైన రాజకీయ ఉద్దేశ్యం ఉంది. ప్రస్తుతం దీని అమలు సాధ్యాసాధ్యాలు, ఆర్థిక ప్రభావాల గురించి అధ్యయనం చేస్తున్నట్లు రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారి ఒకరు తెలిపారని న్యూస్ 18 తన కథనంలో తెలిపింది. అయితే, ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయిస్తే, దాన్ని ఏ పద్ధతిలో అమలు చేయాలనే దానిపై రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఒక స్పష్టతకు రాలేదని సమాచారం. అర్హులైన మహిళల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా నగదు బదిలీ ద్వారా ఒకేసారి ఆర్థిక సహాయాన్ని అందించడం లేదా ఇప్పటికే అమలులో ఉన్న 'ముఖ్యమంత్రి కన్యా సుమంగళ యోజన', 'నిరాశ్రిత మహిళా పెన్షన్ యోజన' లేదా 'ముఖ్యమంత్రి సమూహిక వివాహ యోజన' వంటి మహిళా సంక్షేమ పథకాల ద్వారా ఈ ఆర్థిక సహాయాన్ని అందించాలనే విషయంలో చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+