Diwali 2024: దీపావళి సెలవు మరో రోజు పొడిగింపు..!!

దీపావళి సెలబ్రేషన్స్ కు సర్వం సిద్దం అవుతున్నారు. ఈ నెల 31, నవంబర్ 1 తేదీల్లో దీపావళి నిర్వహణ పైన పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే, 31నే దీపావళి జరుపుకోవాలని పండితులు సూచించారు. దీంతో, పండుగ సెలవు పైతం అదే రోజున (31వ తేదీ) ప్రకటించారు. అయితే, పండుగ ప్రత్యేకతల కారణంగా దీపావళి సెలవును మరో రోజు ప్రకటిస్తూ యూపీ సీఎం నిర్ణయం తీసుకున్నారు. దీంతో, ఉద్యోగులకు వరుసగా నాలుగు రోజులు సెలవులు రానున్నాయి.

దీపావళి సెలవులు
దీపావళి వేళ యూపీ సీఎం యోగీ కీలక నిర్ణయం తీసుకున్నారు. 31న దీపావళి సెలవుగా తొలుత ప్రకటించారు. దీపావళి తరువాత రెండు రోజుల పాటు పండుగ కొనసాగుతుంది. ఈ సమయంలో యూపీ సీఎం యోగీ కీలక నిర్ణయం తీసుకున్నారు. దీపావలి మరుసటి రోజు అయిన నవంబర్ 1వ తేదీ ప్రభుత్వ ఉద్యోగులకు, విద్యా సంస్థలకు సెలవు పొడిగించారు. ఇక, రెండో తేదీ శనివారం, మూడో తేదీ ఆదివారం కావటంతో ఈ సారి దీపావళి సెలవులు ఆ రాష్ట్రంలో వరుసగా నాలుగు రోజులు వచ్చినట్లైంది.

UP Govt government has declared an extra holiday for Diwali

ఉత్తరాఖండ్ లోనూ
ఇదే బాటలో ఉత్తరాఖండ్ ప్రభుత్వం సైతం నిర్ణయం తీసుకుంది. ఉత్తరాఖండ్ ప్రభుత్వం కూడా ఒకరోజు అదనపు హాలిడేను ప్రకటిచింది. నవంబర్ 1న కూడా హాలిడే ప్రకటించడంతో శని, ఆదివారాలతో కలిసి నాలుగు రోజుల పాటు ప్రభుత్వ ఉద్యోగులకు ఫెస్టివల్ బ్రేక్ లభిస్తుంది. దీంతో, ఉద్యోగులు ..విద్యార్ధులు దీపావళి సంబరాలను కుటుంబ సభ్యులతో నాలుగుా రోజుల పాటు జరుపుకునే వెసులుబాటు కలుగుతుంది. ఈ సారి దీపావళి వేళ శ్రీరాముడు కొలువైన అయోధ్య నగరం మరో రికార్డు క్రియేట్ చేయబోతోంది. అయోధ్యలో ఎనిమిదో దీపోత్సవం అత్యంత వైభవంగా జరిగేందుకు ఏర్పాట్లు చేశారు.

అయోధ్యలో దీపాల రికార్డు
దీపాల వెలుగులో అయోధ్యలోని సరయూ తీరం వెంబడి రామ్‌ కీ పైడీతో సహా 55 ఘాట్‌ల వద్ద 25 లక్షల దీపాలు వెలిగించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీంతో అయోధ్య దీపోత్సవం మరో రికార్డును సాధించనుంది. దీపోత్సవం కోసం స్థానికులు అయోధ్యను అందంగా ముస్తాబు చేస్తున్నారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రామ్‌ కీ పైడీలో తొలి దీపం వెలిగించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. లేజర్ షో, బాణసంచా, రాంలీలా ‍ప్రదర్శనలు ఉంటాయి. బాలరాముని ప్రతిష్ఠాపన మహోత్సవం తర్వాత జరుగుతున్న తొలి దీపోత్సవం ఇదే కావడంతో లక్షలాదిగా భక్తులు తరలివస్తున్నారు. సరయూ ఒడ్డున 28 లక్షల దీపాలను వెలిగించనున్నారు. పాత రికార్డును బ్రేక్‌ చేసి గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో కొత్త రికార్డు నమోదుకానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+