UPSC Prelims 2020: సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలు విడుదల...

దేశంలో అత్యున్నత సర్వీసు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ 2020 ఫలితాలతో పాటు యూపీఎస్సీ ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ ప్రిలిమ్స్ 2020 ఫలితాలు శుక్రవారం(అక్టోబర్ 23) విడుదలయ్యాయి. విద్యార్థులు upsc.gov.in. వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.

UPSC Prelims 2020: ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి

Step 1: యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ upsc.gov.in సందర్శించండి.

Step 2: హోమ్ పేజీలో కనిపించే 'UPSC Civil Services Prelims 2020 results' ఆప్షన్‌ని క్లిక్ చేయండి.

Step 3: పీడీఎఫ్ ఫార్మాట్‌లో ఉన్న ఫలితాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి.ప్రిలిమ్స్ ఫలితాల్లో అర్హత సాధించినవారి రూల్ నంబర్స్ మాత్రమే అందులో ఉంటాయి.

Step 4: ఫలితాలు క్రోనోలాజికల్ ఆర్డర్‌లో కనిపిస్తాయి. మీ రూల్ నంబర్ కోసం స్కాన్ చేయండి లేదా ఫైండ్ ఆప్షన్ ద్వారా ఫలితాలను చెక్ చేసుకోండి.

UPSC Civil Services Prelims 2020 results declared

ఫలితాల అనంతరం ఒకేసారి లక్షల సంఖ్యలో అభ్యర్థులు యూపీఎస్సీ వెబ్‌సైట్‌ను సందర్శించడంతో సైట్ ప్రస్తుతం పనిచేయట్లేదు. upsc.gov.in ద్వారా ఫలితాలు పొందలేనివారు...upsconline.nic.in వెబ్‌సైట్ నుంచి ప్రిలిమ్స్ 2020 ఫలితాలకు సంబంధించిన పీడీఎఫ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ ఏడాది దాదాపు 10.58లక్షల మంది ప్రిలిమ్స్ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారు. ప్రిలిమ్స్‌కు అర్హత సాధించినవారు మెయిన్స్ పరీక్షలు రాస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+