ఆర్‌బీఐ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన ఉర్జిత్ పటేల్: ముందున్న సవాళ్లివే
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కొత్త గవర్నర్‌గా ఉర్జిత్ పటేల్ సోమవారం బాధ్యతలు చేపట్టారు. 2013 జనవరి నుంచి డిప్యూటీ గవర్నర్ సేవలందించిన ఉర్జిత్ పటేల్ ఆర్‌బీఐ 24వ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టారని, ఈనెల 4 నుంచి ఆయన మూడేళ్ల పాటు పదవిలో కొనసాగుతారని ఆ ప్రకటన పేర్కొంది.
బాండ్ ఆఫ్ మింట్‌స్ట్రీట్ అని మార్కెట్ వర్గాలు ముద్దుగా పిలుచుకున్న ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ పదవీకాలం ఆదివారంతో ముగిసిన సంగతి తెలిసిందే. రాజన్ స్థానంలో ఉర్జిత్ పటేల్ నియామకానికి కేంద్రం కేబినెట్ నియామకాల కమిటీ ఆగస్టు 20న ఆమోదించింది.

కాగా, ఈనెల 4వ తేదీ ఆదివారం కావడం, సోమవారం వినాయకచవితి పండుగ సెలవు ఉండటంతో డాక్టర్ పటేల్ మంగళవారంనాడు పూర్తి బాధ్యతలు స్వీకరిస్తారని ఆర్‌బీఐ ఒక ప్రకనటలో పేర్కొంది. నిజానికి ఆర్‌బీఐలో డిప్యూటీ గవర్నర్‌కు పదోన్నతి లభించడం కాస్త అరుదు.
అయితే డిప్యూటీ గవర్నర్‌గా పనిచేశాక ఆర్‌బీఐ సారథ్య బాధ్యతలు చేపట్టే అవకాశం దక్కిన 8వ వ్యక్తిగా పటేల్ నిలిచారు. డిప్యూటీ గవర్నర్‌గా పనిచేసి పూర్తి పదవీకాలం గవర్నర్‌గా పనిచేయబోయే నాలుగో వ్యక్తి పటేల్. అంతేకాదు గతంలో అంతర్జాతీయ ద్రవ్య నిధిలో(ఐఎంఎఫ్) పనిచేసిన ఆరో ఆర్‌బీఐ గవర్నర్.
ఆర్‌బీఐ గవర్నర్ పటేల్ ముందున్న ప్రధాన సవాళ్లు
* గతంలో సేకరించిన ఎఫ్‌సీఎన్‌ఆర్(బీ) డిపాజిట్లపై తిరిగి చెల్లింపులు జరుపాల్సిన సమయం ఆసన్నమైంది.
* ఈ రెండు నెలల్లో 2,000-2,500 కోట్ల డాలర్ల విదేశీ మారక ద్రవ్యం బయటికి తరలిపోనున్న నేపథ్యంలో మార్కెట్‌లో ద్రవ్య కొరత ఏర్పడకుండా చూడటం.
* రూపాయి మారకం విలువను కాపాడటం ప్రస్తుతం ఆర్‌బీఐ ముందున్న అతిపెద్ద సవాల్.
* రిటైల్ ధరల ద్రవ్యోల్బణం 6 శాతం ఎగువకు చేరిన నేపథ్యంలో పటేల్ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టారు.
* వచ్చే మార్చినాటికి సూచీని 5 శాతం దిగువకు తగ్గించడం మరో ప్రధాన సవాల్
* అంతేకాదు ఐదేళ్ల కాలానికి ద్రవ్యోల్బణాన్ని 4 శాతానికి(+/- 2%) కట్టడి చేయాలని కేంద్రం లక్ష్యం
* ఈ టార్గెట్‌ను దృష్టిలో పెట్టుకొని పటేల్ ద్రవ్యవిధానాలను రూపొందించుకోవాలి.
* ప్రభుత్వ బ్యాంకింగ్ రంగాన్ని పట్టిపీడిస్తున్న ప్రధాన సమస్య మొండి బకాయిలు (ఎన్‌పీఏలు).
* వీటిని తగ్గించుకునేందుకు బ్యాంకులిప్పటికే చర్యలు ప్రారంభించాయి.
* అయితే ఇప్పటికే నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా వచ్చే మార్చినాటికి బ్యాంకులు ఎన్‌పీఏల సమస్యను పరిష్కరించుకోగలిగేలా చూడాల్సిన బాధ్యత పటేల్‌పై ఉంది.












Click it and Unblock the Notifications