Johnson & Johnson..12-17 ఏళ్లలోపు వారికీ వ్యాక్సిన్: థర్డ్‌వేవ్

న్యూఢిల్లీ: దేశంలో ప్రాణాంతక కరోనా వైరస్ తీవ్రత ఇంకా పూర్తిగా తగ్గట్లేదు. రోజువారీ కేసుల్లో పెరుగుదల నమోదవుతోంది. కరోనా సెకెండ్ వేవ్ ఆరంభంలో కనిపించినప్పటి దుస్థితి ఇప్పుడు లేదు గానీ.. మహమ్మారి పూర్తిగా నియంత్రణలో ఉండట్లేదు. కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో ఇప్పటికీ వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతోన్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తాజా బులెటిన్ ప్రకారం.. దేశవ్యాప్తంగా 36,571 కేసులు నమోదయ్యాయి. యాక్టివ్ కేసులు 3,63,605గా రికార్డయ్యాయి. రికవరీ రేటు 97.54 శాతంగా ఉంది.

57 కోట్లు దాటిన టీకాలు..

57 కోట్లు దాటిన టీకాలు..

మరోవంక- కరోనా వైరస్ మహమ్మారిని నిర్మూలించడానికి ఉద్దేశించిన వ్యాక్సినేషన్ కార్యక్రమం జోరుగా సాగుతోంది. ఇప్పటిదాకా 57,22,81,488 మందికి వ్యాక్సిన్లు వేసినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 24 గంటల్లో దేశవ్యాప్తంగా 54,71,282 మందికి వ్యాక్సిన్లు వేసినట్లు తన తాజా బులెటిన్‌లో పొందుపరిచింది. 18 సంవత్సరాలు నిండిన వారికి కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్ వేస్తోంది. పిల్లలు, టీనేజర్లకు ఇంకా ఈ కార్యక్రమాన్ని వర్తింపజేయలేదు.

ఆ మూడింటితోనే..

ఆ మూడింటితోనే..

ప్రస్తుతం వ్యాక్సినేషన్ కోసం అందుబాటులో ఉన్నవి రెండు టీకాలే. ఒకటి- కోవిషీల్డ్.. రెండు- కోవాగ్జిన్. ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ కోవిషీల్డ్. దీన్ని మనదేశానికే చెందిన సీరమ్ ఇన్‌స్టిట్యూట్ తయారు చేస్తోంది. కోవాగ్జిన్‌ను హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ అభివృద్ధి చేసింది. రష్యాకు చెందిన గమేలియా రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ అభివృద్ధి చేసిన స్పుత్నిక్ వీ అందుబాటులోకి వచ్చింది. దాని వినియోగం పరిమితంగా ఉంటోంది.

12 నుంచి 17 ఏళ్లలోపు వారికి

12 నుంచి 17 ఏళ్లలోపు వారికి

12 నుంచి 17 సంవత్సరాల లోపు వయస్సున్న వారిపైనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడానికి అనుమతి ఇవ్వాలంటూ అమెరికాకు చెందిన జాన్సన్ అండ్ జాన్సన్ కోరింది. ఈ మేరకు సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్‌సీఓ)కు దరఖాస్తును సమర్పించింది. కరోనా వైరస్ బారి నుంచి భావితరాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా సంభవించిన కరోనా మరణాల్లో చిన్నపిల్లలు, యుక్త వయస్సుకు వచ్చిన వారి సంఖ్య చెప్పుకోదగ్గ స్థాయిలో ఉందని తెలిపింది.

ఈ జాబితాలో జాన్సన్ అండ్ జాన్సన్

ఈ జాబితాలో జాన్సన్ అండ్ జాన్సన్

12 నుంచి 17 సంవత్సరాల లోపు పిల్లలకు వ్యాక్సిన్ ఇవ్వడానికి ఇప్పటికే పలు టాప్ ఫార్మాసూటికల్స్ కంపెనీలు డ్రగ్ రెగ్యులేటర్ అనుమతిని కోరాయి. అమెరికా వంటి కొన్ని దేశాల్లో 12 సంవత్సరాలకు పైనున్న వయస్సున్న పిల్లలకూ వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. ఫైజర్ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ దీనికోసం వినియోగిస్తోన్నారక్కడ. మోడెర్నా కూడా 12 సంవత్సరాలకు పైనున్న వారి కోసం వ్యాక్సిన్లను అభివృద్ధి చేసింది. భారత్‌కు చెందిన జైడస్ క్యాడిలా 12 ప్లస్ వయస్సున్న వారి కోసం క్లినికల్ ట్రయల్స్‌ను పూర్తి చేసింది. హైదరాబాద్‌కు చెందిన టాప్ ఫార్మా కంపెనీ భారత్ బయోటెక్, చైనాకు చెందిన సినోవాక్, సినోఫార్మ్, రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్ వీ, రెండేళ్లకు పైనున్న పిల్లలకు ఇవ్వడానికి నోవావ్యాక్స్ క్యాండిడేట్‌కు చెందిన కోవోవ్యాక్స్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ చేపట్టింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+