ట్రైన్ టికెట్ కన్ఫామ్ కావాలంటే ఇలా చేయండి
రైళ్లల్లో రిజర్వేషన్ టికెట్ల కోసం అనేక కోటాలుంటాయి. వీటిగురించి తెలిసినవారు చాలా తక్కువ. తెలుసుకుంటే వెయిటింగ్ లిస్టులో ఉన్న టికెట్లను కన్ఫామ్ చేయించుకోవచ్చు. నెలరోజుల ముందు టికెట్ తీసుకుంటేకానీ రిజర్వేషన్ దొరకడంలేదు. ఆలస్యంగా బుక్ చేస్తే వెయిటింగ్ లిస్టు టికెట్లు తీసుకోవాల్సి వస్తుంటుంది. అత్యవసరంగా ప్రయాణం చేసేవారిని హెచ్ వో కోటా ఆదుకుంటుంది. దీన్ని హై అఫీషియల్ కోటా అంటారు.
అత్యవసర సమయంలో ప్రయాణం చేసే వీఐపీల కోసం ఈ కోటా అందుబాటులో ఉంటుంది. పలువురు వీఐపీలు హెచ్ వో కోటాద్వారానే తమ టికెట్లను కన్ఫమ్ చేయించుకుంటారు. సాధారణ ప్రయాణికులు కూడా దీనిద్వారా ప్రయోజనాన్ని పొందొచ్చు. రైల్వే అధికారులు, బ్యూరోక్రాట్లు, వీఐపీలకు తక్కువ సంఖ్యలోనే బెర్త్ లు అందుబాటులో ఉంటాయి. ఎవరు ముందుగా వస్తే వారికే టికెట్ కన్ఫామ్ అవుతుంది. పూర్తి చార్ట్ సిద్ధమైనప్పుడే టికెట్ కన్ఫామ్ అయిందా? లేదా? అని తెలుస్తుంది.

హెచ్ వో కోటాలో సామాన్యులు కూడా రైలు టికెట్లను కన్ఫామ్ చేయించుకోవడానికి దరఖాస్తు చేసుకోవచ్చు. హెచ్ వో కోటా కోసం దరఖాస్తు చేయడానికి ప్రయాణ తేదీకి ఒక రోజు ముందు రిజర్వేషన్ కౌంటర్‌కు వెళ్లి, అత్యవసరంగా ప్రయాణించడానికి గల కారణాలను వివరిస్తూ ఎమర్జెన్సీ కోటా ఫామ్ పూర్తిచేసి చీఫ్ రిజర్వేషన్ సూపర్‌వైజర్‌కు ఇవ్వాలి. హెచ్ వో కోటా ద్వారా రైలు టికెట్ కన్ఫామ్ చేయాలని అప్లికేషన్ ఫామ్ రాయడంతోపాటు దానిపై గెజిటెడ్ అధికారి సంతకం తీసుకోవాలి. మీ అప్లికేషన్ ఫామ్ సమర్పించిన తర్వాత దీనికి సంబంధించిన సమాచారాన్ని డివిజనల్, జోనల్ కార్యాలయాలకు పంపిస్తారు. ఉన్నతాధికారుల ఆమోదం తర్వాత రైలు టికెట్ కన్ఫామ్ అవుతుంది












Click it and Unblock the Notifications