తూచ్ .. సర్ఫ్ ఎక్సెల్ అనుకోని మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ పై విమర్శలు
హైదరాబాద్ : సోషల్ మీడియా వెలుగులోకి వచ్చిన తర్వాత ప్రతీ అంశం ఏదో ఒక సందర్భంలో రాద్దాంతమవుతోంది. విభిన్న వర్గాలను కించపరిచేలా ఉన్నాయని పోస్టులు పెడుతూ తమ నిరసన తెలుపుతున్నారు. ఇటీవల సర్ప్ ఎక్సెల్ రూపొందించిన హోలీ యాడ్ పై కూడా విమర్శలు వెల్లువెత్తాయి. కానీ యూజర్ పప్పులో కాలేశాడు. అదేనండి సర్ప్ ఎక్సెల్ పై విమర్శలు చేయాలనుకొని మైక్రాసాప్ట్ ఎక్సెల్ పై చేసి నాలుక్కరుచుకున్నాడు.
ఇదీ యాడ్ ...
ఇటీవల సర్ఫ్ ఎక్సెల్ హోలీ పండుగ కోసం ఓ యాడ్ రూపొందించింది. అందులో ఓ పాప సైకిల్ పై వెళుతూ రంగులు చల్లించుకుంటుంది. వారి వద్ద రంగులు పూర్తయ్యాక ముస్లిం బాలుడికి లిప్ట్ ఇస్తోంది. నమాజ్ కోసం మసీదు వద్ద అతడిని దింపుతోంది. హిందువులను కించపరుస్తారా అని కొందరు సర్ప్ ఎక్సెల్ పై మండిపడ్డారు. ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరలయ్యాయి.

ఎక్సెల్ .. ఎక్సెల్ సేమ్ ... సర్ఫ్ కాదు
ఇలాగే ఓ యూజర్ సర్ప్ ఎక్సెల్ ను విమర్శించబోయాడు. కామెంట్ రాయాలనే తొందరలో తప్పుచేశాడు. సర్ప్ ఎక్సెల్ బదులు మైక్రో సాప్ట్ ఎక్సైల్ పై కామెంట్ చేశాడు. గూగుల్ ప్లేలోకి వెళ్లి యాప్ లో రివ్యూ రాశాడు. 'డిటర్జెంట్ వాడొద్దని కోరాడు, సర్ప్ ఎక్సెల్ ను నిషేధించండి, హిందూ విరోది అది. పాకిస్థాన్ వెళ్లి అక్కడ వ్యాపారం చేసుకో అంటూ రివ్యూ రాశాడు. ఆ కామెంట్ మైక్రోసాఫ్ట్ ఎక్సైల్ యాప్ కు వెళ్లింది. దీంతో అది ట్విట్టర్ లో వైరలైంది. దీనిపై నెటిజన్లు సరదా కామెంట్లు కూడా పెట్టారు.
-
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి.. -
అమరావతితో కూడిన ఏపీ కొత్త మ్యాప్ వచ్చేసింది.. తేడాలు సుస్పష్టం !!












Click it and Unblock the Notifications