ఆగ్రా పేరు ఇక ఆగ్రవాన్ !: మహాభారత కాలంలో అలాగే పిలిచారని, తాజ్ మహల్ పేరు?

ఆగ్రా: ఉత్తరప్రదేష్ లోని యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం ప్రపంచ ప్రసిద్ది చెందిన ఆగ్రా (తాజ్ మహల్) పేరు మార్చడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రతిరోజు దేశ విదేశాల నుంచి ఆగ్రాలోని తాజ్ మహల్ సందర్శిచడానికి వేలాది మంది పర్యాటకులు ఆగ్రాకు వస్తుంటారు. ఇక ముందు ఆగ్రాను ఆగ్రవాన్ గా పిలిచే రోజులు దగ్గర పడుతున్నాయి.

ఇక ముందు తాజ్ మహల్ ఉండే ఆగ్రా పేరు ఆగ్రవాన్ గా మార్చడానికి కసరత్తులు చేస్తున్నారు. ఉత్తరప్రదేష్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ భాద్యతలు స్వీకరించిన తరువాత ఆ రాష్ట్రంలోని ప్రముఖ నగరాల పేర్లు ఒక్కొక్కటి మారిపోతున్నాయి.

తాజాగా ఆ జాబితాలో ఆగ్రా పేరు చేరుతోంది. ఆగ్రా పేరును ఆగ్రవాన్ గా మార్చడానికి ప్రతిపాదనలు సిద్దం చేస్తున్నారని వెలుగు చూసింది. చరిత్రను వెలికితీసి ఆగ్రా పేరును ఆగ్రవాన్ గా మార్చాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.

Uttar Pradesh Yogi Adityanath govt plans to change Agra’s name Agravan

అసలు ఆగ్రాకు ఆపేరు ఎలా వచ్చింది ? అంటూ అంబేద్కర్ యూనివర్శిటీ చరిత్ర విభాగానికి చెందిన ప్రొఫెసర్ సుగమ్ ఆనంద్ ఇప్పటికే పరిశోధనలు ప్రారంభించారు. తాజ్ మహల్ ఉన్న తాజ్ నగర్ ను మొదట్లో ఆగ్రవాన్ గా పిలిచే వారని ప్రాథమిక సాక్షాల ద్వారా తెలిసిందని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ అధికారులు అంటున్నారు.

ఆగ్రాను ఆగ్రవాన్ అని ఎప్పటి నుంచి పిలిచే వారు ఆని పూర్తి సమాచారం బయటకు తీసే పనిలో ఆంబేద్కర్ యూనివర్శిటీ ప్రొఫెసర్ సుగమ్ ఆనంద్ నిమగ్నం అయ్యారు. మహాభారత్ కాలంలో ఆగ్రాను ఆగ్రవాన్, ఆగ్రబాణ్ అని పిలిచేవారని ప్రాథమిక సాక్షాల ద్వారా తెలిసిందని, అందుకు సంబంధించిన పూర్తి సాక్షాలు తాము సేకరిస్తున్నామని అంబేద్కర్ యూనివర్శిటీ ప్రొఫెసర్ సుగమ్ ఆనంద్ అంటున్నారు. మొత్తం మీద తాజ్ మహల్ ఉన్న ఆగ్రాను త్వరలో ఆగ్రవాన్ అని పిలవడానికి అందరూ సిద్దంగా ఉండాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పరోక్షంగా సంకేతాలు ఇచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+