కలకలం రేపుతున్న వరుస అత్యాచారాలు..మరో నర్సుపై లైంగిక దాడి, హత్య
కోల్‌కతాలోని ఆర్‌జీ కార్ మెడికల్ కాలేజ్‌లో జూనియర్ డాక్టర్ అత్యాచారం, హత్య ఘటన మరువక ముందే మరో నర్సుపై అఘాయిత్యానికి పాల్పడిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.ఉత్తరాఖండ్‌లో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సు పని చేస్తుండగా, ఆమె మృతదేహం రాంపూర్ జిల్లాలో ఖాళీ స్థలంలో కనిపించింది. ఈ భయంకరమైన సంఘటన ఉత్తరాఖండ్‌లోని ఉధమ్‌సింగ్ నగర్ జిల్లాలో జరిగింది.ఈ ఘటన జూలై 30న జరిగినట్లు పోలీసులు తమ నివేదిక పేర్కొన్నారు.
జూలై 31న, బాధితురాలి సోదరి అంతకుముందు రాత్రి ఇంటికి రాకపోవడంతో స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు ఆగస్టు 8న నర్సు మృతదేహాన్ని గుర్తించారు. ఈ కేసులో పోలీసులు అనుమానితుడు ధర్మేంద్ర కుమార్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. నిందితుడు ధర్మేంద్ర కుమార్ ఆసుపత్రి నుంచి ఇంటికి వెళుతున్న నర్సుపై కుమార్ లైంగిక దాడికి పాల్పడి హత్య చేశాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు మొదట ఆమెను పొదల్లోకి ఈడ్చుకెళ్లి అత్యాచారం చేసి గొంతుకోసి హత్య చేశాడు. అనంతరం ఆమె వద్ద ఉన్న నగలను దోచుకుని పరారయ్యాడు. బాధితురాలి ఫోన్‌ను ట్రాక్ చేసిన పోలీసులు రాజస్థాన్‌కు చెందిన వ్యక్తిని అరెస్టు చేశారు.
నిందితుడు డ్రగిస్ట్ అని పోలీసులు గుర్తించారు. ఘటన జరిగిన రోజు ఒంటరిగా వెళ్తున్న మహిళను చూసి ఆమెపై దాడి చేశాడని పోలీసులు తెలిపారు. నిర్మానుష్య ప్రాంతానికి నర్స్‌ను బలవంతంగా తీసుకువెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఆమెను గొంతు కోసి హత్య చేశాడు. హత్యానంతరం మహిళ నగలు తీసుకుని పరారయ్యాడని పోలీసులు తెలిపారు.
ఇక కోల్‌కతాలోని ఆర్‌జీ కార్ మెడికల్ కాలేజీ ఆవరణలో ఆగస్టు 9న ఒక జూనియర్ డాక్టర్ అత్యాచారం మరియు హత్యకు గురైన తర్వాత హెల్త్‌కేర్ కమ్యూనిటీ సమ్మెకు పిలుపునిచ్చింది. కోల్‌కతా పోలీసులు తమ తప్పుని కప్పిపుచ్చారని ప్రతిపక్ష నాయకులు , వైద్య సంఘాలు ఆరోపించాయి.
-
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications