విస్కీ బాటిల్ తో బాలీవుడ్ నిర్మాత ముఖం పచ్చడి చేసిన హీరోయిన్ సంజన, రచ్చరచ్చ, తల్లిని తిట్టింది!
బెంగళూరు: స్యాండిల్ వుడ్ ప్రముఖ నటి సంజనా గర్లానీపై వివాదం మొదలైయ్యింది. విస్కీ బాటిల్, గ్లాస్ తీసుకుని తన ముఖం మీద సంజనా దాడి చేసిందని ప్రముఖ బాలీవుడ్ నిర్మాత వందనా జైన్ బెంగళూరు నగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాగిన మైకంలో బెంగళూరు నగరంలోని ఓ ఫైవ్ స్టార్ హోటలో నటి సంజనా, బాలీవుడ్ నిర్మాత వందనా జైన్ రచ్చరచ్చ చేశారనే విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. బాలీవుడ్ నిర్మాత వందనా జైన్ స్యాండిల్ వుడ్ నటి సంజనా మీద ఫిర్యాదు చేశారని, కేసు విచారణలో ఉందని బెంగళూరు డీసీపీ చేతన్ సింగ్ రాథోడ్ దృవీకరించారు.

ఫైవ్ స్టార్ హోటల్ లో పబ్
బెంగళూరు నగరంలోని కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ లోని కూంఝీ బార్ (పబ్)లో క్రిసమస్ పండుగ సందర్బంగా డిసెంబర్ 24వ తేదీ రాత్రి మందు పార్టీ ఏర్పాటు చేశారు. ఈ మందు పార్టీకి ప్రముఖ సెలబ్రిటీలు హాజరైనారు. బాలీవుడ్ నిర్మాత వందనా జైన్, స్యాండిల్ వుడ్ ప్రముఖ నటి సంజనా సైతం ఇదే పార్టీకి హాజరైనారు.

ఒకే టేబుల్ లో వందనా, సంజనా
రాత్రి పబ్ లోని ఒకే టేబుల్ లో వందనా జైన్, సంజనా మద్యం సేవించారు. తరువాత ఇద్దరి మద్య చిన్న విషయంలో వాగ్వివాదం మొదలైయ్యింది. మద్యం మత్తులో ఉన్న వందనా జైన్, సంజనా ఏదో మాట్లాడుకుంటున్నారని అక్కడ ఉన్న వారు భావించారు. అయితే వందనా జైన్, సంజనాల మధ్య మాటామాటా పెరిగిపోయిందని తెలిసింది.

విస్కీ బాటిల్ తో ముఖం పచ్చడి !
మద్యం మత్తులో ఉన్న నటి సంజనా ఆమె చేతిలో విస్కీ గ్లాస్, విస్కీ బాటిల్ తీసుని వందనా జైన్ ముఖం మీద దాడి చేసిందని సమాచారం. సంజనా, వందనా జైన్ రచ్చరచ్చ చెయ్యడంతో అక్కడ ఉన్న వారు ఇద్దరికీ నచ్చచెప్పారని తెలిసింది. మద్యం మత్తులో చిన్న విషయానికి మాటామాటా పెరిగి ఇలా జరిగిందని అక్కడ ఉన్న కొందరు అంటున్నారు.

బెంగళూరు కమిషనర్
గొడవ జరిగిన తరువాత వందనా జైన్ నేరుగా కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్ చేరుకుని నటి సంజనా మీద ఫిర్యాదు చేశారు. నటి సంజనా మీద బాలీవుడ్ నిర్మాత వందనా జైన్ ఫిర్యాదు చేశారని, కేసు విచారణలో ఉందని డీసీపీ చేతన్ సింగ్ రాథోడ్ దృవీకరించారు. సంజనా, వందనా జైన్ రాద్దాంతం బెంగళూరు నగర పోలీసు కమిషనర్ భాస్కర్ రావ్ వరకు వెళ్లిందని పోలీసు వర్గాలు అంటున్నాయి. తాను ప్రస్తుతం బెంగళూరులో లేనని, ఆదివారం అక్కడికి వచ్చిన తరువాత అన్ని విషయాలు పూర్తిగా చెబుతానని వందనా జైన్ అంటున్నారు.

నా తల్లిని ధూషించింది
పబ్ లో గొడవ జరిగిన మాట వాస్తవం, తన తల్లిని వందనా జైన్ దూషించడంతో పాటు తన చెయ్యి పూర్తిగా వెనక్కు తిప్పడంతో నొప్పి కలిగిందని, ఆ సమయంలో వందనా మీద తాను చెయ్యి చేసుకోవలసి వచ్చిందని సంజనా అంటోంది. మొత్తం మీద సంజనా, వందనా రాద్దాంతం పోలీసుల తలుపుతట్టిందని స్యాండిల్ వుడ్ వర్గాలు చెబుతున్నాయి.

వందనా జైన్ బెంగళూరు మహిళ
బెంగళూరుకు చెందిన వందనా జైన్ బాలీవుడ్ సినిమాల నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్నారు. బెంగళూరుకు చెందిన వందనా జైన్ ప్రస్తుతం ముంబైలో నివాసం ఉంటున్నారు. అయితే నిత్యం వందనా జైన్ బెంగళూరులోని పార్టీలకు, శుభకార్యాలకు వచ్చి వెలుతున్నారు. బల్విందర్ సింగ్ ఫేమస్ హోగయా తదితర హిందీ హిట్ సినిమాలను వందనా జైన్ నిర్మించారు.
-
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..!












Click it and Unblock the Notifications