వందే భారత్ స్లీపర్ రైలు.. మొదటి ఏసీ కోచ్ డిజైన్ చూస్తే మతిపోతుంది!
భారతదేశంలో రైల్వే అడ్వాన్స్డ్ గా దూసుకుపోతుంది. ఇప్పటికే అమృత్ భారత్, వందే భారత్ వంటి ఎక్స్ప్రెస్ లు దేశవ్యాప్తంగా సేవలను అందిస్తుంటే, తాజాగా వందే భారత్ స్లీపర్ రైళ్లు రయ్యిన దూసుకుపోవడానికి రెడీ అయ్యాయి. తాజాగా వందే భారత్ స్లీపర్ రైలుకు సంబంధించి మొదటి ఏసీ కోచ్ డిజైన్ నేడు ఇండోనేషియన్ జాయింట్ వెంచర్ అయిన కైనైట్ రైల్వే సొల్యూషన్స్ ఆవిష్కరించింది.
అంతర్జాతీయ రైల్వే పరికరాల ప్రదర్శన 2025 లో అద్భుతమైన ఆవిష్కరణ
న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన అంతర్జాతీయ రైల్వే పరికరాల ప్రదర్శన 2025 లో ఈ ఆవిష్కరణ అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. భారతీయ రైల్వే కోసం 120 వందే భారత్ స్లీపర్ రైళ్లను తయారు చేసి, నిర్వహించడానికి ప్రముఖ రష్యన్ రోలింగ్ స్టాక్ మేజర్ టి ఎమ్ హెచ్, రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ ల మధ్య జాయింట్ వెంచర్ గా కైనైట్ రైల్వే సొల్యూషన్స్ ఏర్పాటయింది.

వందే భారత్ స్లీపర్ రైలుకు సంబంధించి మొదటి ఏసీ కోచ్ డిజైన్
ఇది తాజాగా రూపొందించిన వందే భారత్ స్లీపర్ రైలుకు సంబంధించి మొదటి ఏసీ కోచ్ డిజైన్ చాలా విశాలంగా, ఫోర్ బెర్త్ కంపార్ట్మెంట్ తో అన్ని సౌకర్యాలతో కూడుకొని ఉంది. ఇది ప్రయాణికులకు మెరుగైన గోప్యతను కూడా అందిస్తుంది. ప్రతి బెర్త్ కు యూఎస్బీ పోర్ట్, వ్యక్తిగత రీడింగ్ లైట్, స్మార్ట్ స్టోరేజ్ సొల్యూషన్స్ వంటి అనేక సౌకర్యాలు ఉన్నాయి. అత్యాధునిక సౌకర్యాలతో చాలా లగ్జరీగా ఈ ఏసీ కోచ్ బెర్త్ లు కనిపిస్తున్నాయి. చాలా మంచి రంగులతో మెరిసిపోతూ అధునాతనంగా కనిపిస్తున్నాయి.
అత్యద్భుతంగా కనువిందు చేస్తున్న ఫస్ట్ క్లాస్ ఏసీ కోచ్
భారతీయ కళాత్మకతను తెలియజేసేలా సాంప్రదాయ బ్లాక్ ప్రింటింగ్ టెక్నిక్ తో కూడిన సున్నితమైన జాతీయ శైలి మోటిఫ్, క్యాబిన్ కు మంచి అందాన్ని ఇచ్చింది. అత్యద్భుతంగా కనువిందు చేస్తున్న ఈ కోచ్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది . ఐఆర్‌ఈఈ 2025లో, కైనైట్ రైల్వే సొల్యూషన్స్ ప్రాజెక్ట్ డైరెక్టర్ నిషాంక్ గార్గ్ మాట్లాడారు. లాతూర్‌లోని మరాఠ్వాడా రైల్ కోచ్ ఫ్యాక్టరీ ఆధునీకరణ చివరి దశలో ఉందని, 2025 చివరి నాటికి ఉత్పత్తి పెంచాలని యోచిస్తున్నామని ఆయన తెలిపారు.
2026 జూన్‌లో మొదటి నమూనాను ఆవిష్కరించాలని కంపెనీ యోచన
గార్గ్ ఫస్ట్ ఏసీ స్లీపర్ కంపార్ట్‌మెంట్ డిజైన్ కాన్సెప్ట్ సమర్పణ ఈ ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుందని పేర్కొన్నారు. 2026 జూన్‌లో మొదటి నమూనాను ఆవిష్కరించాలని కంపెనీ భావిస్తోందని ఆయన వెల్లడించారు .












Click it and Unblock the Notifications