వెర్సే ఇన్నోవేషన్‌లో కీలక నియామకం:CPTOగా ప్రసన్న ప్రసాద్ నియామకం..!!
బెంగళూరు: భారతదేశపు అగ్రగామి AI ఆధారిత లోకల్ లాంగ్వేజ్ టెక్నాలజీ ప్లాట్‌ఫామ్ 'వెర్సే ఇన్నోవేషన్' తన ప్రయాణంలో మరో కీలక అడుగు వేసింది.సంస్థ యొక్క ఇంజనీరింగ్, ప్రొడక్ట్, డేటా సైన్స్ విభాగాలను నడిపించేందుకు ప్రసన్న ప్రసాద్‌ను చీఫ్ ప్రొడక్ట్ అండ్ టెక్నాలజీ ఆఫీసర్ (CPTO)గా నియమించింది.
AI రంగంలో సరికొత్త విప్లవం..
డైలీహంట్ (Dailyhunt), జోష్ (Josh), వన్ ఇండియా (Oneindia), నెక్స్‌వెర్స్.AI (NexVerse.ai) వంటి ప్లాట్‌ఫామ్‌లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత మార్పులను వేగవంతం చేయడం ప్రసన్న ప్రసాద్ ప్రధాన బాధ్యత. ముఖ్యంగా కంటెంట్ క్రియేటర్లకు మరిన్ని సదుపాయాలు కల్పించడం, డిజిటల్ అడ్వర్టైజింగ్ రంగంలో వినూత్న మార్పులు తీసుకురావడంపై ఆయన దృష్టి సారించనున్నారు.

రెండు దశాబ్దాల అనుభవం..
ప్రసన్న ప్రసాద్‌కు ప్రొడక్ట్ ఇంజనీరింగ్,డేటా సైన్స్‌లో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గతంలో ఆయన 'వెర్వ్ గ్రూప్' (Verve Group Inc)లో సీటీఓగా పనిచేశారు.అమెరికా,భారత్,యూరప్ దేశాల్లోని అంతర్జాతీయ బృందాలను నడిపించిన ట్రాక్ రికార్డ్ ఆయనకు ఉంది.క్లౌడ్-నేటివ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మరియు AI ఆధారిత సిస్టమ్స్ నిర్మించడంలో ఆయన నిష్ణాతులు.
సంస్థ వ్యవస్థాపకుల ధీమా..
వెర్సే ఇన్నోవేషన్ కో-ఫౌండర్ ఉమంగ్ బేడీ మాట్లాడుతూ"ప్రస్తుత డిజిటల్ యుగంలో ప్లాట్‌ఫామ్‌లను నిర్మించడానికి,విస్తరించడానికి AI చాలా కీలకం.ప్రసన్న ప్రసాద్ నాయకత్వంలో మా AI సామర్థ్యాలు మరింత బలోపేతం అవుతాయని,అడ్వర్టైజర్లు,యూజర్లకు మెరుగైన ఫలితాలను అందిస్తామని నమ్ముతున్నాం" అని పేర్కొన్నారు.
ప్రసన్న ప్రసాద్ స్పందన..
తన నియామకంపై ప్రసన్న ప్రసాద్ స్పందిస్తూ.. "టెక్నాలజీ అనేది కేవలం ఒక సాధనం మాత్రమే కాదు,అది ఒక ప్రత్యేక గుర్తింపును ఇవ్వాలి.వెర్సే ఇన్నోవేషన్ వృద్ధిలో భాగం కావడం,కంటెంట్ మరియు మానిటైజేషన్ రంగాల్లో AI ద్వారా కొత్త ఒరవడిని సృష్టించడం పట్ల నేను ఎంతో ఉత్సాహంగా ఉన్నాను" అని తెలిపారు.
వెర్సే ఇన్నోవేషన్ గురించి:
సాంకేతికత ద్వారా డిజిటల్ అంతరాలను తొలగించాలనే లక్ష్యంతో వెర్సే పనిచేస్తోంది.గూగుల్,మైక్రోసాఫ్ట్,సెకోయా క్యాపిటల్ వంటి దిగ్గజ సంస్థల పెట్టుబడులతో,స్థానిక భాషా సాంకేతిక రంగంలో భారతదేశపు మొట్టమొదటి యూనికార్న్‌గా ఈ సంస్థ గుర్తింపు పొందింది.
-
నైరుతి రుతుపవనాలు షాక్. ఈ 4 నెలలు వర్షాలు కరువే? -
సమ్మర్ స్పెషల్ 'బాదంపాలు'.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి..! -
ఆ గోర్లేంటీ.. ఆ చెయ్యేంటీ: అల్లు అర్జున్- అట్లీ బాక్సాఫీస్ కింగ్ కాంగ్: ఈ దెబ్బకు -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' మూవీ ఫస్ట్ రివ్యూ: హిట్టు కొట్టి కొట్టి బోర్ కొట్టట్లేదా అన్నా..!! -
బంగారం ధరల్లో బిగ్ డౌన్ ఫాల్.. !! -
తమిళనాడులో రిచ్ అభ్యర్థి ఈమెనే! ఎవరీ లీమా రోజ్ మార్టిన్? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం, ద్రోణి- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
Assembly Poll Survey: బెంగాల్, అస్సాంలో గెలుపెవరిది ? షైనింగ్ ఇండియా తాజా సర్వే..! -
ఇరాన్ డెడ్ లైన్ పై ట్రంప్ మళ్లీ వెనక్కి ? అదే టర్నింగ్ పాయింట్..! -
జగన్ సెగ ఎక్కడ తాకాలో అక్కడ తాకింది.. -
వేసవి సెలవులలో పిల్లలు ఆ పనిచేసే అవకాశం.. తల్లిదండ్రులు అలెర్ట్! -
Tamil Nadu Poll Survey: తమిళనాడులో షాకింగ్ ఫలితాలు-లోక్ పోల్ తుది సర్వేలో వారే క్లీన్ స్వీప్..!












Click it and Unblock the Notifications