పాత కరెన్సీకి మోక్షం. రద్దైన నోట్లపై హైకోర్టు తీర్పు

నోట్ల రద్దు సమయంలో చేతిలో పాత నోట్లు ఉండిపోయి, గడువు ముగిసిపోయి ఏం చేయాలో తెలియక తలపట్టుకున్న ఎంతోమందిని మనం చూశాం. కానీ, తప్పు తనది కాకపోయినా తన రూ. 2 లక్షల నగదును ఆర్బీఐ మార్చకపోవడంతో గిరీష్ మలానీ అనే వ్యక్తి కోర్టు మెట్లెక్కారు. తాజాగా బాంబే హైకోర్టు నాగ్‌పూర్ ధర్మాసనం ఈ కేసులో ఇచ్చిన తీర్పు బాధితుడికి పెద్ద ఊరటనిచ్చింది.

అసలేం జరిగింది? పోలీసుల జప్తు.. ఆర్బీఐ నిరాకరణ!

కథ 2016 డిసెంబర్ 1న మొదలైంది. గిరీష్ మలానీ తన వాహనంలో వెళ్తుండగా మున్సిపల్ ఎన్నికల తనిఖీల్లో భాగంగా పోలీసులు ఆయన దగ్గర ఉన్న రూ. 2 లక్షల నగదును (అప్పట్లో చలామణిలో ఉన్న పాత రూ. 500 నోట్లు) స్వాధీనం చేసుకున్నారు. అయితే, ఆదాయపు పన్ను శాఖ విచారణలో ఆ డబ్బు చట్టబద్ధమైనదేనని తేలింది. కానీ, ఆ నోట్లను పోలీసులు తిరిగి మలానీకి ఇచ్చేసరికి కాలం మించిపోయింది. డిసెంబర్ 31, 2016న ఆయనకు ఆ డబ్బు అందింది.. అప్పటికే పాత నోట్ల మార్పిడికి కేంద్రం ఇచ్చిన గడువు (డిసెంబర్ 30) ముగిసిపోయింది.

Victory for Citizen Bombay HC Orders RBI to Exchange Demonetized Notes Seized by Police in 2016

ఆర్బీఐ మెలిక.. కోర్టు ఆగ్రహం!

తన దగ్గర ఉన్న పాత నోట్లను మార్చాలని మలానీ ఆర్బీఐని కోరగా.. "నిబంధనలు ఒప్పుకోవు" అంటూ ఆర్బీఐ తిరస్కరించింది. ముఖ్యంగా, పోలీసులు ఆ నోట్ల సీరియల్ నంబర్లను రికార్డ్ చేయలేదనే సాంకేతిక కారణాన్ని ఆర్బీఐ సాకుగా చూపింది. దీనిపై మలానీ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన జస్టిస్ ఉర్మిళ జోషి-ఫాల్కే, జస్టిస్ నివేదితా మెహతాల ధర్మాసనం ఆర్బీఐ తీరును తప్పుబట్టింది.

తప్పు అధికారులది.. నష్టపోవాల్సింది సామాన్యుడా?

"సంబంధిత కాలంలో నగదుపై పిటిషనర్‌కు ఎలాంటి నియంత్రణ లేదు. అధికారుల వద్ద డబ్బు ఉండిపోయినప్పుడు, షరతులను కఠినంగా వర్తింపజేసి బాధితుడిని నష్టదాయక స్థితిలో ఉంచడం సరికాదు" అని కోర్టు స్పష్టం చేసింది. అధికారుల తప్పుకు సామాన్యుడిని శిక్షించడం న్యాయం కాదని అభిప్రాయపడింది.

కోర్టు తీర్పు..

గిరీష్ మలానీ ఒక వారంలోగా తన వద్ద ఉన్న పాత రూ. 2 లక్షల నగదును ఆర్బీఐలో డిపాజిట్ చేయాలి. ఆర్బీఐ ఆ నోట్లను ధృవీకరించిన తర్వాత, ఏడు వారాల్లోగా వాటికి సమానమైన కొత్త కరెన్సీని మలానీకి చెల్లించాలి.

ఈ తీర్పు వ్యవస్థలో ఉన్న లోపాలను ఎత్తిచూపడమే కాకుండా, పారదర్శకంగా ఉన్న సామాన్యుడికి న్యాయస్థానాలు ఎప్పుడూ అండగా ఉంటాయని నిరూపించింది. ఎనిమిదేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత మలానీ తన కష్టార్జితాన్ని తిరిగి పొందబోతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+