video: గాలి నింపుతుండగా పేలిన జేసీబీ టైరు.. గాల్లో లేచిపడి ఇద్దరు వ్యక్తులు మృతి, తునాతునకలు
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని రాయ్‌పూర్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. బుల్డోజర్ వాహనం టైరు నింపుతున్న సమయంలో ఒక్కసారిగా పేలడంతో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన రాయ్‌పూర్ జిల్లా సిల్తారా ఇండస్ట్రియల్ ఏరియాలో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
పెద్ద టైరులో ఓ కార్మికుడు గాలి నింపుతున్నాడు. అదే సమయంలో మరో కార్మికుడు వచ్చి ఆ టైరులో గాలి ఎంత వరకు నిండిందనే విషయం తెలుసుకునేందుకు తనిఖీ చేస్తున్నాడు. టైరును రెండు మూడు సార్లు గట్టిగా నొక్కాడు. దీంతో ఆ టైరు పేలిపోయింది.

టైరు పేలడంతో అక్కడనే ఉన్న ఇద్దరు వ్యక్తులు గాలిలో పైకి లేచి కిందపడ్డారు. అక్కడంతా పొగలాంటి దుమ్ము లేచింది. దీంతో వారిద్దరూ అక్కడికకక్కడే ప్రాణాలు కోల్పోయారు. వారి శరీర భాగాలు కూడా చెల్లాచెదురుగా పడిపోవడం చూస్తే ఎంత భారీ స్థాయిలో ఈ పేలుడు సంభవించిందో తెలుసుకోవచ్చు.
Two people were killed when a tyre of a JCB burst while they were filling air in it at a vehicle workshop in the Raipur @ndtv @ndtvindia pic.twitter.com/A4I9miCjNo
— Anurag Dwary (@Anurag_Dwary) May 5, 2022
కాగా, మృతి చెందిన ఇద్దరు కార్మికులు రాజ్‌పాల్ సింగ్, ప్రంజన్ నాందేవ్ మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రేవా జిల్లాకు చెందినవారు. టైరు పేలుడు ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా, ఈ టైరు పేలుడుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000












Click it and Unblock the Notifications