Video: బుక్ డెలివరీ కోసం ఫోన్ నెంబర్ అడిగిన ముస్లిం యువకుడిపై మహిళల దాడి

భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయిని పుస్తక ఉత్సవంలో ముస్లిం విక్రేతపై దాడి జరిగింది. డోర్ డెలివరీ కోసం వారి కాంటాక్ట్ నంబర్‌ను అడిగినందుకు ముస్లిం పుస్తక విక్రేతపై హిందూ మహిళల బృందం దాడి చేసింది. అతడిని చెంపదెబ్బ కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ముస్లిం వర్గానికి చెందిన పలువురు జర్నలిస్టులు ఈ వీడియోను ఎక్స్ (ట్విట్టర్)లో షేర్ చేశారు.

స్థానిక మీడియా సమాచారం ప్రకారం.. వకార్ సలీమ్ అనే బాధితుడు ఫెస్ట్‌లో బుక్ స్టాల్‌ను ఏర్పాటు చేశాడు. మహిళల బృందం బుక్ డెలివరీ గురించి అడిగి తెలుసుకున్నారు. ఆ తరువాత, అతను హోమ్ డెలివరీని సమన్వయం చేయడానికి వారి కాంటాక్ట్ నంబర్‌ను అడిగాడు. దీంతో మహిళలు వేధింపులుగా భావించి అతడ్ని కొట్టడం ప్రారంభించారు.

 Video: Hindu Women Beat Up Muslim Book Vendor At Ujjain Fest After He Asks Contact Details For Home Delivery

బాధితుడు వకార్ సలీమ్ పరిస్థితులను వివరిస్తూ ఒక వీడియో కూడా విడుదల చేశాడు. సలీమ్ తన ప్రచురణ ప్రధాన కార్యాలయం గురుదాస్‌పూర్‌లో ఉందని, అతను పుస్తక ప్రదర్శన కోసం గ్వాలియర్ నుంచి ఉజ్జయిని వరకు ప్రయాణించానని పేర్కొన్నాడు.

గొడవకు దిగిన దుర్గావాహిని గ్రూపులోని ఒక మహిళ.. చెడు ఉద్దేశ్యంతోనే వకార్ సలీం తన నంబర్ అడిగాడని ఆరోపించింది. ఈ క్రమంలోనే దాడి చేసినట్లు చెప్పుకొచ్చింది. అయితే, ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో దాడికి పాల్పడినవారిపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు. బుక్ డెలివరీ కోసం ఫోన్ నెంబర్ అడిగితే ఇలా దాడికి పాల్పడటం సరికాదని వ్యాఖ్యానిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+