Viral Video: చిల్లర లేవా.. అయితే యూపీఐ చేయండి.. వీడియో వైరల్..
దేశంలో టెక్నాలజీ పెరిగిపోయింది. ముఖ్యంగా డబ్బుల లావాదేవీల్లో సాంకేతికత శరవేగంగా విస్తరిస్తుంది. ఇప్పుడంత డిజిటల్ విధానంలోనే ట్రాన్సక్షన్స్ జరుపుతున్నారు. యూపీఐ అందుబాటులోకి వచ్చిన తర్వాత డబ్బుల బదిలీ సులభం అయింది. షాపులో రూ.10 వస్తువు కొన్నా యూపీఐ ద్వారా పేమెంట్ చేస్తున్నారు.

అంత ఆన్ లైన్
జేబులో డబ్బులు లేకుండా అకౌంట్లో డబ్బులుంటే చాలు అన్నట్లు బయటకు వస్తున్నారు. అయితే డబ్బులు అడుకున్న భిక్షగాళ్లు, లేదా గంగెడ్లోళ్లు డబ్బులు అడిగితే చాలా మంది డబ్బులు లేవని చెబుతున్నారు. దీంతో వారు కూడా అప్ డేట్ అయ్యారు. క్యూఆర్ కోడ్ తో అడుకుంటున్నారు. చిల్లర లేదు అన్నవారికి యూపీఐ చేయండి అని కోరుతున్నారు.

క్యూఆర్ కోడ్ స్కాన్
తాజాగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి బసువన్న(ఎద్దు) తీసుకుని అడుక్కోవడానికి వచ్చాడు. ఎద్దుకు క్యూఆర్ బోర్డు వేసుకుని వచ్చాడు. ఓ వ్యక్తి క్యూఆర్ కోడ్ స్కాన్ డబ్బులు పంపించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను అవనిష్ శరణ్ పోస్ట్ చేశారు.
లక్షకు పై వ్యూస్
నిన్న పోస్ట్ చేసిన ఈ వీడియోకు ఇప్పటి వరకు లక్షకు పై వ్యూస్ వచ్చాయి. 6 వేలకు పైగా లైక్స్ రాగా 7 వందల మంది రీట్వీట్లు చేశారు. మీరు కూడా అప్డేడ్ అయ్యారా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications