Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అమానుషం: గిరిజన కూలీపై మూత్రం పోసిన వ్యక్తి, ఎన్ఎస్ఏ నమోదుకు సీఎం చౌహాన్ ఆదేశం

భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సిధి జిల్లాలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. రోజువారీ కూలీగా పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఆదివాసీ యువకుడిపై ఓ వ్యక్తి మూత్ర విసర్జనకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఎప్పుడు జరిగిందో తెలియదు కానీ.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. దీంతో కాంగ్రెస్ సహా విపక్షాలు రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడుతున్నాయి.

ఈ ఘటనపై మధ్యప్రదేశ్ మాజీ సీఎం, కాంగ్రెస్ నేత కమల్‌నాథ్ కూడా స్పందించారు. ఇలాంటి హేయమైన చర్యలకు నాగరిక సమాజంలో చోటు లేదని ఆయన అన్నారు. మధ్యప్రదేశ్‌లో ఆదివాసీలపై జరుగుతున్న ఆకృత్యాలు అంతం కావాలన్నారు కమల్‌నాథ్.

 Video shows man urinating on tribal labourer; Madhya Pradesh CM Chouhan ordered to book culprit under NSA

'ఈ దారుణం ప్రభుత్వానికి కనిపించలేదా? నేరస్తుడిని ఇంత వరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు?' అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. నిందితుడు బీజేపీ ఎమ్మెల్యేకి అనుచరుడని అందుకే అతడిని అరెస్ట్ చేయలని కాంగ్రెస్ విమర్శిస్తోంది. దీంతో బీజేపీ ఎమ్మెల్యే కేదార్నాథ్ శుక్లా స్పందించారు. నిందితుడికి బీజేపీతో సంబంధం లేదని, అతడు తన అనుచరుడు కూడా కాదని ఎమ్మెల్యే శుక్లా స్పష్టం చేశారు.

మరోవైపు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో తన దృష్టికి వచ్చినట్లు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ చౌహాన్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. నేరస్తుడిని వెంటనే అరెస్ట్ చేయాలని, అతడిపై కఠన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అంతేగాక, నిందితుడిపై ఎన్ఎస్ఏ కింద కేసు నమోదు చేయాలని ఆదేశించారు.

తెలంగాణ రాష్ట్ర రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ వై సతీష్ రెడ్డి కూడా వ్యక్తి మూత్ర విసర్జనకు సంబంధించిన వీడియోను ట్విట్టర్‌లో పోస్టు చేశారు. అంతేగాక, నిందితుడు బీజేపీ ఎమ్మెల్యే అనుచరుడంటూ ఆరోపించారు. దీంతో బీజేపీ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. తప్పుడు వార్తలంటూ మండిపడ్డారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+