వీడియో వైరల్: రైల్వే గేట్ తొండంతో ఎంత సున్నితంగా ఈ ఏనుగు ఎత్తిందో చూడండి..!

గజరాజులు గుంపుగా వెళుతుండటం చూస్తే కన్నుల విందుగా ఉంటుంది. అలానే గజరాజులు ఏది చేసినా వార్తల్లో నిలుస్తాయి. కొద్ది రోజుల క్రితం ఓ ఏనుగు పశ్చిమబెంగాల్‌లో ఓ మిలటరీ క్యాంటీన్‌లోకి ప్రవేశించి బీభత్సం సృష్టించింది. అయితే అక్కడి మనుషులకు మాత్రం ఎలాంటి హానీ తలపెట్టలేదు. కర్రకు నిప్పు పెట్టి దాని ఎదురుగా నిలబడితే భయంతో క్యాంటీన్ నుంచి బయటకు పరుగులు తీసింది. ఆ వీడియో కొద్ది రోజుల క్రితం వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా మరో గజరాజు వీడియో వైరల్ అవుతోంది.

ఓ గజరాజు అలా దారిలో నడుచుకుంటూ వెళుతుండగా రైల్వే లెవెల్ క్రాస్ ఎదురైంది. మరికొన్ని క్షణాల్లో రైలు వస్తుందనగా రైల్వేగేట్ పడింది. ఇక ఆ గేటును విరగొట్టే శక్తి ఉన్నప్పటికీ.. ఆ ఏనుగు ఎంతో సున్నితంగా తన తొండంతో గేటును ఎత్తింది. ఆ తర్వాత దానికింద నుంచి వెళ్లి పట్టాలు దాటింది. ఇక అవతల వైపు కూడా గేటు ఉండటంతో దాని పైనుంచి ఎగిరి స్మూత్‌గా దాటుకుంది.

 Video Viral: Watch how this elephant carefully crosses the Railway tracks

ఏనుగు రైలు పట్టాలు దాటుతున్న వీడియో ఐఎఫ్ఎస్ ఆఫీసర్ సుశాంత నంద సోషల్ మీడియాలో పోస్టు చేశారు. పోస్టు చేసిన కొన్ని గంటల్లోనే వీడియో వైరల్ అయ్యింది. ఏనుగులు తాము నడిచే దారి ఎప్పటికీ గుర్తుంచుకుంటాయని సుశాంత చెప్పారు. ఏనుగులు ఎక్కడి నుంచి ఎక్కడికి వలస వెళ్లినా ఆ మార్గాన్ని గుర్తుంచుకుంటాయని చెప్పారు. డిసెంబర్ 8వ తేదీన సుశాంత ఈ వీడియో పోస్టు చేశారు. కొన్ని గంటల్లోనే 43వేల మంది నెటిజెన్లు వీడియోను వీక్షించారు. అంతేకాదు 2500 లైక్స్ కూడా వచ్చాయి. ఇక ఈ వీడియో చూసిన నెటిజెన్లు కామెంట్స్ కూడా చేశారు. ఏనుగు చిన్నగా పట్టాలు దాటుతుండగా ఒకవేళ రైలు వేగంగా వచ్చి ఢీకొంటే పరిస్థితి ఏంటని కొందరు జంతుప్రేమికులు ఆందోళన వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+