పవన్ ఫార్ములాతో బరిలోకి విజయ్ - నియోజకవర్గం ఫిక్స్, తాజా సర్వే రిపోర్ట్స్..!!
ఇక్కడ పవన్ కల్యాణ్. అక్కడ విజయ్. ఇద్దరూ ఫ్యాన్ ఫాలోయింగ్ తో పాటుగా రాజకీయంగా తమ సత్తా చాటుతున్నారు. పవన్ సుదీర్ఘ పోరాటం తరువాత 2024 ఎన్నికల్లో విజయం సాధించి.. డిప్యూటీ సీఎం అయ్యారు. ఇక.. ఇప్పుడు విజయ్ తన లక్కు పరీక్షించుకుంటున్నారు. ఇందు కోసం ఏపీలో పవన్ ఏ విధంగా పోటీ చేసారో... ఎలా ముందుకు వెళ్లారో.. అదే రూటులో రాజకీయం గా ముందుకు వెళ్తున్నారు. ఎన్నికల్లో పోటీ నుంచి రాజకీయ ప్రణాళికల వరకు అదే తరహాలో ప్లాన్ చేసుకుంటున్నారు.
తమిళనాట అసెంబ్లీ ఎన్నికలు ఈ సారి హోరా హోరీగా మారుతున్నాయి. తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత, నటుడు విజయ్ తన రాజకీయ అరంగేట్రంపై సర్వేలతో సిద్దమయ్యారు. తన తొలి పోరు.. అసెంబ్లీలో అడుగు పెట్టేందుకు ఏపీలో పవన్ ఫార్ములాతో ముందుకు వెళ్తున్నారు. ఇందు కోసం ముందుగా తన తొలి ఎన్నికల పోరు కోసం చెన్నైలోని రెండు ప్రధాన నియోజకవర్గాల ను పరిశీలిస్తున్నారు. చెన్నైలోని వేళచ్చేరి .. విరుగంబాక్కం నియోజకవర్గాల్లో ఏదో ఒక స్థానం నుండి విజయ్ పోటీ చేయాలని భావిస్తున్నారు. ఈ మేరకు స్థానికంగా అనుకూలతలు.. పబ్లిక్ పల్స్ తెలుసుకునేందుకు సర్వేలు చేయిస్తున్నారు. తుది నివేదికల ఆధారంగా పోటీ పైన విజయ్ తన నిర్ణయం ప్రకటించనున్నారు. హీరో విజయ్ తన పేరు ప్రారంభ అక్షరం V తో మొదలయ్యే నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు ఇందు కోసం చెన్నైలోని 'వేళచ్చేరి', 'విరుగంబాక్కం', విల్లుపురంలోని 'విక్రవాండి', నాగపట్టినంలోని 'వేదారణ్యం', కరూర్ జిల్లాలోని 'వేదసందూర్' స్థానాలు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

పవన్ తరహాలోనే రాజకీయం
కాగా, ప్రస్తుతం విజయ్ నివాసం ఉండే పనైయూర్‌కు వేళచ్చేరి సమీపంలో ఉంది. విజయ్ తల్లి దండ్రులు విరుగంబాక్కంలో నివసిస్తున్నారు. ఇక విక్రవాండిలో పార్టీ తొలి భారీ బహిరంగ సభ విజయవంతం కావడంతో ఆ నియోజకవర్గంపై కూడా ప్రత్యేక ఆసక్తి నెలకొంది. కాగా.. విజయ్ తన ప్రధాన ప్రత్యర్దుల గురించి కీలక అంశాలను వెల్లడించారు. బీజేపీని సైద్ధాంతిక శత్రువు గా, అదే విధంగా డీఎంకేను రాజకీయ శత్రువుగా ప్రకటించారు. అదే సమయంలో ఈ ఏడాది జరిగే ఎన్నిక ల్లో తమతో కలిసి వచ్చే పార్టీలతో అధికారాన్ని పంచుకోవడానికి సిద్ధమని విజయ్ చేసిన ప్రకటన రాజకీయంగా సంచలనంగా మారుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయ్ అభిమాన సంఘం 'విజయ్ మక్కల్ ఇయక్కం' అభ్యర్థులు 115 స్థానాల్లో విజయం సాధించటంతో.. ఇక, ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లోనూ సత్తా చాటేందుకు సిద్దం అవుతున్నారు. విజయ్ త్వరలోనే తన పార్టీ అభ్యర్థుల జాబితాను ఖరారు చేయనున్నారు. దీని ద్వారా ఎన్నికల్లో విజయ్ ఎన్ని సీట్లు సాధిస్తారు.. తుది ఫలితాల తరువాత తమిళనాడు కొత్త ప్రభుత్వంలో విజయ్ పాత్ర ఏంటనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ!











Click it and Unblock the Notifications