విజయ్ "మేనిఫెస్టో" మైండ్ బ్లోయింగ్..? సీఎం సీటు ముఖ్యం బిగిలు..!

తమిళనాడులో ఎన్నికల హడావుడి మొదలైంది. అధికారాన్ని నిలబెట్టుకోవాలని డీఎంకే పార్టీ ప్రయత్నిస్తుండగా.. తిరిగి అధికారం కైవసం చేసుకోవాలని అన్నాడీఎంకే యత్నిస్తోంది. ఇక మరోవైపు తమిళ స్టార్ హీరో, టీవీకే పార్టీ అధినేత విజయ్ సీఎం సీటే లక్ష్యంగా ఎన్నికల ప్రణాళికలు రచిస్తున్నారు. టీవీకే పార్టీ స్థాపించిన తర్వాత తొలిసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగబోతున్నారు విజయ్. దాంతో అందరి చూపూ విజయ్ టీవీకే పార్టీపైనే ఉంది.

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే టీవీకే పార్టీ బరిలోకి దిగుతుందని విజయ్ ఇప్పటికే స్పష్టం చేశారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా తలొగ్గే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఇక అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న క్రమంలో పార్టీ మేనిఫెస్టోపై టీవీకే పార్టీ దృష్టి పెట్టింది. ప్రజల అవసరాలు, అభిప్రాయాలకు అనుగుణంగా మేనిఫెస్టోను రూపొందించాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే టీవీకే ఎలక్షన్ మేనిఫెస్టో కమిటీ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు టూర్ చేపట్టింది.

ఈ ఎలక్షన్ మేనిఫెస్టో కమిటీ ఒక్కో రోజు ఒక్కో ప్రాంతంలో టూర్ చేపట్టనుంది. అక్కడి ప్రజలకు ఏం కావాలి..? తమ అవసరాలు ఏంటి..? ఎలాంటి పథకాలు కోరుకుంటున్నారు..? అభిప్రాయాలు ఏంటి..? అని ప్రజల్నే నేరుగా అడిగి అందుకు అనుగుణంగా మేనిఫెస్టోను రూపొందించనున్నారు. ఫిబ్రవరి 1 నుంచి ఈ టూర్ ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 1 న మధురై, ఫిబ్రవరి 4 న కడలూరు, ఫిబ్రవరి 7న కోయంబత్తూరు, ఫిబ్రవరి 9 న తిరుచిరాపల్లి, ఫిబ్రవరి 11న చెన్నై ప్రాంతాల్లోని ప్రజల అభిప్రాయాలను అడిగి తెలుసుకోనున్నారు.

ఒక్కో జోన్ లో అక్కడి ఎన్జీఓ, సామాజిక కార్యకర్తలు, ప్రజలతో సమావేశం నిర్వహించనున్నారు. పీపుల్స్ ఓపీనియన్ బాక్స్ ఏర్పాటు చేస్తారు. ప్రజలు తమ డిమాండ్స్, సూచనలు, సలహాలను ఆ బాక్సులో వేస్తారు. అలాగే డిజిటల్, సోషల్ మీడియా వేదికగానూ ప్రజల అభిప్రాయాలను తెలుసుకోనున్నారు. ఈ క్రమంలో రైతులు, విద్యార్థులు, మహిళలు, యువత, కార్మికులు, నేతన్నలు, మత్స్య కారులు.. ఇలా ప్రతి రంగానికి చెందిన ఓటర్లను ప్రత్యేకంగా కలిసి వారి నుంచి సలహాలు, సూచనలు సేకరించనున్నారు. మొత్తానికి తమిళనాడు అభివృద్ధే లక్ష్యంగా మేనిఫెస్టోను రూపొందించనున్నట్లు టీవీకే పార్టీ తాజాగా ఎక్స్ వేదికగా పోస్టు పెట్టింది.

vijay TVK Election Manifesto Committee Launches Massive Statewide Tour One Region One Day

మరోవైపు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని టీవీకే అధినేత విజయ్ ఇటీవల జరిగిన ఓ మీటింగ్ లో ప్రకటించిన విషయం తెలిసిందే. ఎవరు ఎంత ఒత్తిడి చేసినా.. ఎవ్వరికీ తలవంచబోమని విజయ్ తేల్చి చెప్పారు. త్వరలో రాష్ట్రంలో జరగబోయేది ఎన్నికలు కాదని.. ప్రజాస్వామ్య యుద్ధమని స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+