Vikram: ఐసీయూలో స్టార్ హీరో, గుండె ట్యూబ్ లు బ్లాక్, మణిరత్నం సినిమా ట్రైలర్ రిలీజ్ రోజే !
చెన్నై: ప్రముఖ తమిళ హీరో, బహుబాషా నటుడు, జాతీయ ఉత్తమ నటుడు విక్రమ్ తీవ్ర అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చేశారు. విక్రమ్ హీరోగా మణిరత్నం దర్శకత్వంలో నటిస్తున్న పొన్నియన్ సెల్వన్ సినిమా ట్రైలర్ విడుదల అయ్యే రోజే హీరో విక్రమ్ ఆసుపత్రి పాలుకావడంతో ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గుండె సంబంధిత వ్యాధితో చెన్నైలోని ఆసుపత్రిలో చేరిన హీరో విక్రమ్ కు గుండెకు సంబంధించిన రెండు ట్యూబ్ లు బ్లాక్ అయ్యాయని, ఆయన ఐసీయూలో ఉన్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి.

కమల్ హాసన్ తరువాత ?
జాతీయ ఉత్తమ నటుడు, బహుబాషా నటుడు కమల్ హాసన్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతోంది. భారతదేశంలో కమల్ హాసన్ కు ప్రత్యేకమైన స్థానం ఉంది. కమల్ హాసన్ తరువాత అలాంటి గెటప్పులు వెయ్యడం, అలా నటించడం ఒక విక్రమ్ కే సాధ్యం అవుతోందని ఆయన అభిమానులు అంటుంటారు. విక్రమ్ గతంలో నటించిన పాత్రలు అలాంటి కావడంతో అది నిజమే అని అందరూ నమ్మాలి.

చిన్న నటుడిగా ఎంట్రీ.... ఈరోజు స్టార్ హీరో
హీరో విక్రమ్ చిన్ననటుడిగా టీవీ సీరియల్స్ లో నటుడిగా ఎంట్రీ ఇచ్చారు. తరువాత అనేక సినిమాల్లో నటించిన హీరో విక్రమ్ పలవిన్ సేతు అనే తమిళ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక పితామగన్ అనే సినిమాతో విక్రమ్ జాతీయ ఉత్తమనటుడి అవార్డు సొంతం చేసుకున్నాడు. అప్పటి నుంచి హీరో విక్రమ్ ఇంత వరకు వెనుతిరిగి చూసుకోలేదు.

మణిరత్నం సినిమాతో బిజీ
మణిరత్నం తెరకెక్కిస్తున్న పొన్నియన్ సెల్వం సినిమాలో హీరో విక్రమ్ కీలకపాత్రలో నటిస్తున్నారు. ఇన్ని రోజులు మణిరత్నం సినిమా పొన్నియన్ సెల్వం సినిమా షూటింగ్ లో విక్రమ్ చాలా బిజీగా గడిపాడు. శుక్రవారం హీరో విక్రమ్ అనారోగ్యానికి గురికావడంతో చెన్నైలోని కావేరీ ఆసుపత్రికి ఆయన్ను తరలించారు.

ఐసీయూలో స్టార్ హీరో.... రెండు ట్యూబ్ లు బ్లాక్
గుండె సంబంధిత వ్యాధితో చెన్నైలోని ఆసుపత్రిలో చేరిన హీరో విక్రమ్ కు గుండెకు సంబంధించిన రెండు ట్యూబ్ లు బ్లాక్ అయ్యాయని, యాంజియోప్లాస్టీ చికిత్స చేసిన తరువాత ఆయన ఐసీయూలో ఉన్నారని కావేరీ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. 56 ఏళ్ల వయసు ఉన్న హీరో విక్రమ్ చికిత్సకు స్పందిస్తున్నారని, ఆయన ఆరోగ్యం మెరుగుపడుతోందని కావేరీ ఆసుపత్రి వర్గాలు అంటున్నాయి.

ఈరోజు సాయంత్రం !
విక్రమ్ హీరోగా మణిరత్నం దర్శకత్వంలో నటిస్తున్న పొన్నియన్ సెల్వన్ సినిమా ట్రైలర్ విడుదల అయ్యే రోజే హీరో విక్రమ్ ఆసుపత్రి పాలుకావడంతో ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పొన్నియన్ సెల్వం సినిమా ట్రైలర్ ను ప్రముఖ తమిళ హీరో సూర్యా విడుదల చెయ్యడానికి ఆ సినిమా యూనిట్ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇలాంటి సమయంలో ఆ సీనిమా హీరో విక్రమ్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు.












Click it and Unblock the Notifications