వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రేసిస్టు వ్యాఖ్య: విదేశీ మహిళపై వినోద్ కాంబ్లీ ఫిర్యాదు

By Pratap
|
Google Oneindia TeluguNews

Vinod Kambli
ముంబై: తనపై జాతి వివక్ష వ్యాఖ్యలు చేసిందంటూ మాజీ భారత క్రికెటర్ వినోద్ కాంబ్లీ ఓ విదేశీ మహిళపై ఫిర్యాదు చేశారు. తాను నివసిస్తున్న హౌసింగ్ సొసైటీలో కారు పార్కింగ్ వివాదం సందర్భంగా ఆమె తనపై ఆ వ్యాఖ్యలు చేసినట్లు ఆయన తెలిపారు.

జ్యువెల్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ భవనంలో నివసించే మహిళతో వాగ్వివాదం జరిగిందని వినోద్ కాంబ్లీ ముంబైలోని బాంద్రా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో చెప్పారు. గురువారం రాత్రి 8గంటల 15 నిమిషాలకు గొడవ జరిగినట్లు ఆయన ఫిర్యాదులో చెప్పాడు.

వివాదం సందర్భంగా తనను విదేశీ మహిళ బుల్లీ అని వ్యాఖ్యానించిందని, దాని అర్థం బ్లాక్ ఇండియన్ అని ఆయన పోలీసులకు చెప్పారు. కాంబ్లీ ఫిర్యాదును తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తామని చెప్పారు. ఈ మేరకు శుక్రవారం మీడియాలో వార్తలు వచ్చాయి.

కారు పార్కింగ్ వివాదం సందర్భంగా సొసైటీ చైర్మన్‌తో మాట్లాడాలని తాను మహిళకు సూచించానని, తనకు భారతదేశంలోనూ, విదేశాల్లోనూ సంబంధాలున్నాయని ఆమె తనను బెదిరించిందని, ఆ తర్వాత తను బ్లాక్ ఇండియన్ అని వ్యాఖ్యానించిందని ఆయన మీడియాతో చెప్పారు. ఆమె అందులో అద్దెకు ఉంటున్నట్లు కాంబ్లీ తెలిపారు. విదేశీయులను భారతీయులుగా తాము అతిథులుగా పరిగణిస్తామని, వారు కూడా మర్యాదగా వ్యవహరించాలని ఆయన అన్నారు.

English summary
Former Indian cricketer Vinod Kambli has filed a complaint against a foreign lady for making a racist comment against him over a car parking dispute in the housing society where he lives.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X