నడిరోడ్డులో బైక్‌పై వెళుతూ ముద్దులతో రెచ్చిపోయిన జంట: వీడియో వైరల్
జైపూర్: ఇటీవల కాలంలో కొంతమంది యువత బహిరంగ ప్రదేశాల్లోనే విచ్చలవిడి తనాన్ని ప్రదర్శిస్తూ ఇతరులకు ఇబ్బందులను కలిగిస్తున్నారు. అందరూ చూస్తున్నారన్న సోయి కూడా లేకుండా రొమాన్స్‌లో మునిగితేలుతున్నారు. ముద్దులు, హగ్గులతో రెచ్చిపోతున్నారు. తాజాగా, ఇలాంటి ఘటనే రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ నగరంలో చోటు చేసుకుంది.
నడిరోడ్డుపై బైక్ వెళుతూ ఓ జంట ముద్దులు పెట్టుకుంటూ రెచ్చిపోయారు. బైక్ నడుపుతున్న యువకుడు హెల్మెట్ పెట్టుకోలేదు. అంతేగాక, తన వెనుక కూర్చున్న ప్రియురాలితో వెనుకకు తిరిగి ముద్దుల్లో మునిగిపోయాడు. అయితే, అటుగా వెళ్తున్న వాళ్లు ఈ తతంగాన్నంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు. ఈ జంటకు ఎంత ఫైన్ వేస్తారని ప్రశ్నిస్తున్నారు. రద్దీ రోడ్డుపై ఇలా ఇష్టమొచ్చినట్లు వ్యవహరించడం సరికాదని కొందరు హితవు పలుకుతున్నారు. మీకు ఎక్కడా సమయం, ప్రదేశం దొరకడం లేదా? అని మండిపడుతున్నారు.
వీడియో వైరల్ కావడంతో దీనిపై స్థానిక ట్రాఫిక్ పోలీసులు స్పందించారు. బైక్ నంబర్ ఆధారంగా ఆ జంటను పట్టుకుని చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు. అయితే, ఇలాంటి ఘటనలు ఇటీవల కాలంలో తరచూ చోటు చేసుకుంటుండటం గమనార్హం. ఎక్కువగా ఈ ఘటనలు నగరాల్లో చోటు చేసుకుంటున్నాయి.
kitne ka chalan hona chaiye?@jaipur_police pic.twitter.com/HVq0Ufiq9Z
— rajni singh (@imrajni_singh) September 15, 2023
నడిరోడ్డుపై బైక్‌పై వెళుతూ ముద్దులు పెట్టుకోవడం, ఇతర శృంగార కార్యకలాపాల్లో మునిగితేలుతూ కనిపిస్తున్నారు. కొన్ని జంటలైతే బైక్‌పై ప్రమాదకర విన్యాసాలు చేస్తూ ఇతరులకు అసౌకర్యాన్ని కలిగిస్తున్నారు. దీంతో ఇలాంటి వారిపై పోలీసులు కఠినంగా వ్యవహరించాలని కోరుతున్నారు.












Click it and Unblock the Notifications